ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu ) నాలుగు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన మొత్తం 26 కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. అభివృద్ధి, పెట్టుబడుల ఆహ్వానం, డిజిటల్ పాలన, స్మార్ట్ సిటీల రూపకల్పనపై ఈ సమావేశాలు జరిగినట్టు సమాచారం. రాష్ట్రానికి అవసరమైన ఎన్నో అంశాలపై విదేశీ నిపుణులతో సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
పర్యటన (Singapore Tour) ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన సమయంలో, సింగపూర్ లోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన బస చేసిన హోటల్ వద్ద జై సీబీఎన్ నినాదాలతో చంద్రబాబుకు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా తెలుగు ప్రజల ప్రేమాభిమానాలను ఎప్పటికి మరచిపోను , తెలుగు వారు చూపిన ప్రేమ, ఆత్మీయత మరువలేనిది” అంటూ చంద్రబాబు అభినందనలు తెలిపారు. విదేశాల్లో ఉన్నా, రాష్ట్రం గురించి ఆరాటపడే తెలుగు ప్రజల జ్ఞాపకాలు ఎల్లప్పుడూ తనతో ఉంటాయని అన్నారు. దేశపరంగా, అంతర్జాతీయంగా తెలుగువారి ప్రతిష్ట పెంచేలా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
Al Qaeda : బెంగళూరులో అల్‌ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్‌మైన్డ్ అరెస్ట్
రాత్రి 10.30కి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడి నుంచి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడకు బయలుదేరి, రాత్రి 11.30కి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. విజయవంతమైన ఈ పర్యటన తరువాత రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.