Chandrababu : ఎక్సైజ్‌ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

గత ఐదేళ్లుగా జరిగింది చూస్తే, పాతికేళ్లలో కూడా కోలుకోలేనంత దెబ్బ తగిలిందని అన్నారు.

  • Written By:
  • Publish Date - July 24, 2024 / 03:56 PM IST

Chandrababu:ఏపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..గత ఐదేళ్లుగా జరిగింది చూస్తే, పాతికేళ్లలో కూడా కోలుకోలేనంత దెబ్బ తగిలిందని అన్నారు. పాలన ఎలా ఉండకూడదో, పాలకుడు ఎలా ఉండకూడదో 2019-24 మధ్య జరిగిన పాలన ఒక కేస్‌ స్టీడీగా మిగిలిపోతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం తెస్తామని హామీ ఇచ్చారు. క్రమేణా మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వస్తామని చెప్పారు… మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామన్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు ఉంటే, వాటిని 2,934కి తగ్గించారు. మళ్లీ వాటిని 3,392 షాపులకు పెంచారు. ఏపీ టూరిజం పేరిట 458 దుకాణాలు కేటాయించారు. 2019లో 840 బార్లు ఉంటే, ఇప్పటికీ ఆ బార్లు అలాగే ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కొంతమంది అవసరాల కోసం తప్పులు చేస్తారు. కొందరు అత్యాశతో తప్పులు చేస్తారు. కొందరు డబ్బుల ఉన్నాదంతో తప్పులు చేస్తారు. ఈ ఐదేళ్లలో డబ్బుల ఉన్నాదంతో విధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఎంతో బాధతో ఈరోజు ఎక్సైజ్‌ విధానంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాను అన్నారు. పేరుకే మద్యపాన నిషేదం..కమిట్‌మెంట్‌ లేదు..మనసులో మాత్రం వేరే ఉద్దేశాలు పెట్టుకున్నారు. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే… మద్యం తాగేవాళ్లు ఆటోమేటిగ్గా తగ్గుతూ వస్తారని చెప్పారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుందట… నాడు ఇదే కుర్చీలో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే అందరూ విన్నారు.

Read Also: YS Jagan : జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా..?

కానీ ధరలు 75 శాతం పెంచారు. అధికారంలోకి వస్తూనే కొత్త జీవో తెచ్చి అడ్డగోలుగా రేట్లు పెంచారు. రూ.80 ధరను రూ.160కి పెంచారు… రూ.160 ఉండే బాటిల్ ను రూ.320కి పెంచారు…. రూ.240 ఉండే మద్యం బాటిల్ ను రూ.480కి పెంచారు… రూ.480 బాటిల్ ను రూ.960కి పెంచారు… పిచ్చితనం కాకపోతే, మైండ్ ఉండే వాడు ఎవడూ ఇలా చేయడు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పోల్చితే మన రాష్ట్రంలో విపరీతంగా ధరలు పెంచేశారు. ఈ అస్తవ్యస్త విధానం ఫలితంగా ఎక్సైజ్ శాఖలో విపరీతంగా కేసులు పెరిగిపోయాయి అని చంద్రబాబు అన్నారు.

Read Also: Nani : నానితో యానిమల్.. తలచుకుంటేనే అదోలా..?

 

 

 

 

 

Follow us