TDP MLA: ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గెలిచిన తర్వాత కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదం అవుతోంది. అందులో ముఖ్యంగా తిరువురూ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు ఏదీ చేసిన అది టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల సమయంలోనే అనేక చీవాట్లు తిన్న కొలికపూడి ఎమ్మెల్యే (TDP MLA)గా విజయం సాధించిన తర్వాత తన నడవడిక ఏదీ మార్చుకున్నట్లు కనిపించటంలేదు. దీంతో కొలికపూడికి ఝలక్ ఇవ్వటానికి స్వయంగా సీఎం చంద్రబాబే రంగంలోకి దిగినట్లు సమాచారం అందుతోంది.
తిరువూరులో సర్పంచ్‌ను తిట్టడంతో అతని భార్య సూసైడ్ అటెంప్ట్ చేయటం, జర్నలిస్టులపై అనుచితంగా మాట్లాడటం, ప్రత్యర్థులపై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలతో ఇటు అధిష్టానానికి మింగుడుపడలేకుండా ఉంది. అయితే ఎమ్మెల్యే తీరుపై సొంత నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంతా చేస్తున్న సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు..? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. నేపథ్యంలోనే ఎమ్మెల్యే కొలికపూడికి షాక్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు, టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కూడా ఊహించని స్థాయిలో షాక్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది. తాజా వివాదాల నేపథ్యంలో తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఎమ్మెల్యే కొలికపూడి స్థానంలో మరొక కీలక నేతకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆయనే నియోజకవర్గ బాధ్యతలను చూడనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కొలికపూడి స్థానంలో శావల దేవదత్ తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉండనున్నట్లు దేవదతే స్వయంగా చెప్పడం గమనార్హం. అయితే దేవదత్ మాటల వెనక టీడీపీ అధిష్ఠానం ఉందని అర్థమవుతోంది. ఆయనకు భరోసా ఇవ్వనిదే అంత బహిరంగంగా చెప్పరని పార్టీ కార్యకర్తలు సైతం చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఒక ఎమ్మెల్యే ఉండగా మరో వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే అది రాష్ట్రంలో సంచలనంగా మారే అవకాశం ఉంది. దీనిపై ఎమ్మెల్యే కొలికపూడి, ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.!