రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు (Chandrababu) వ్యూహాలు రచిస్తున్నారు. ఓ పక్క పొత్తులు , ఎన్నికల హామీలతో పాటు దైవ బలం కోసం కూడా పూజలు , హోమాలు , యాగాలు చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇలాంటి భారీ ఎత్తున హోమాలు చేసి పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు సైతం అలాగే పూజలు చేస్తున్నారు,
We’re now on WhatsApp. Click to Join.
గతంలో పూజలు, హోమాలపై పెద్దగా ఆసక్తి చూపని బాబు.. స్కిల్ కేసులో జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత.. పలు దేవాలయాలు సందర్శిస్తూ సతీమణితో కలిసి మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే శతచండీ పారాయణ ఎకోత్తర వృద్ధి చండీయాగంతో పాటు సుదర్శన నారసింహ హోమాలు నిర్వహించారు. ఇక తాజాగా నేటి నుంచి మూడు రోజులపాటు ఆయన నివాసంలో రాజశ్యామలయాగం (Rajashyamala Yagam) చేయబోతున్నారు. రాష్ట్రంలో అధికారం కోసమే, సీఎం సీటు కోసమే ఇలా బాబు ఆధ్యాత్మిక బాట పట్టారన్న ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం ఏపీ లో రాజకీయ వేడి రోజు రోజుకు కాకరేపుతుంది. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ..ఈసారి కూడా విజయం సాధించాలని పక్క వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. పలు సర్వేల ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. ఇటు టీడీపీ కూడా జనసేన తో ఇప్పటికే పొత్తు ఓకే చేసుకోగా..త్వరలో బిజెపి కూడా వీరితో జత కలవబోతుంది. ఈ మూడు పార్టీలు ఎన్నికల బరిలో నిల్చోబోతున్నాయి.
Read Also : Rahul Gandhi : రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన