చంద్రబాబు క్వాష్ పిటిషన్ (Chandrababu Quash Petition) ను ఏపీ హైకోర్టు (AP High court) తిరస్కరించడంతో..చంద్రబాబు తరుపు లాయర్లు క్వాష్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేసారు. ఈ పిటిషన్ ఫై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా..నాట్ బిఫోర్ మీ అని విచారణకు న్యాయమూర్తి భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేయాలని సీజేఐ వద్ద మెన్షన్ చేశారు.
పిటిషన్ ను తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. త్వరగా లిస్ట్ చేయాలనేది తమ మొదటి అభ్యర్థన అని, చంద్రబాబుకు మధ్యంతరం ఉపశమనం కలిగించాలనేది రెండో అభ్యర్థన అని లూథ్రా విన్నవించారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని లూథ్రా చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసిందని, మరో 15 రోజుల కస్టడీకి కోరుతున్నారని చెప్పారు. జెడ్ కేటగిరీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ఎలా ట్రీట్ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని చెప్పారు. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలను పొందుపరిచారని తెలిపారు.
సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్ కుమార్ కల్పించుకున్నారు. అయినప్పటికీ లూథ్రా వాదనను సీజేఐ పూర్తిగా విన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో వరుస కేసులు వేస్తున్నారని చెప్పారు. తక్షణమే చంద్రబాబుకు ఉపశమనం కలిగించాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న సీజేఐ డీవై చంద్రచూడ్… కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో 3వ తేదీకి వాయిదా వేస్తున్నామని. వచ్చే మంగళవారం వాదనలు వింటామని తెలిపారు.
Read Also : 8th Continent : 375 సంవత్సరాల తర్వాత బయటపడిన 8వ ఖండం.. మ్యాప్ రెడీ!