Site icon HashtagU Telugu

CBN : చంద్రబాబు క్వాష్ పిటిషన్‍పై నేడు సుప్రీంకోర్టులో ప్రస్తావన

Chandrababu Quash Petition

Chandrababu Quash Petition

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు క్వాష్ పిటిష‌న్‌పై నేడు సుప్రీంకోర్టులో ప్ర‌స్తావ‌న‌కు రానుంది. నేడు ప్రస్తావించడానికి సీజేఐ ధర్మాసనం అనుమ‌తి ఇచ్చింది. చంద్రబాబు రిమాండ్‍లో ఉన్నందున వెంటనే విచారించాలని సుప్రీంకోర్టునుచంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా కోరారు. అయితే ఈ రోజు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని నిన్న చంద్ర‌బాబు త‌రుపు లాయ‌ర్‌కు సీజేఐ సూచించారు. చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్‌ని హైకోర్టులో కొట్టివేయ‌డంతో దానిని స‌వాల్ చేస్తూ చంద్ర‌బాబు త‌రుపు న్యాయ‌వాదులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. నిన్న ఈ పిటిష‌న్‌పై సీజేఐ మెన్ష‌న్ లిస్ట్ ద్వారా ఈ రోజు(మంగ‌ళ‌వారం) రావాల‌ని సూచించారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వ‌స్తుందో అని టీడీపీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు ఉత్కంఠ‌గా ఎదురు చూస్త‌న్నారు. మ‌రోవైపు ఏసీబీ కోర్టులో చంద్ర‌బాబు బెయిల్ పిటిష‌న్‌పై నేడు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. నిన్న జ‌రిగిన వాద‌న‌ల‌లో ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న ఏసీబీ కోర్టు జ‌డ్జి ఈ రోజుకు వాయిదా వేశారు. సీఐడీ త‌రుపు న్యాయ‌వాదులు ముందు క‌స్ట‌డీ పిటిష‌న్‌పై విచార‌ణ చేయాల‌ని.. ఇటు చంద్ర‌బాబు త‌రుపు న్యాయ‌వాదులు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ చేయాల‌ని వాద‌న‌లు సాగించారు. ఎంత‌కి తేల‌క‌పోవ‌డంతో విచార‌ణ‌ను ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు ఏ పిటిష‌న్ ముందు విచారించాలో జ‌డ్జి నిర్ణ‌యం తీసుకోనున్నారు.