Site icon HashtagU Telugu

Chandrababu : సుప్రీం కోర్ట్ చంద్రబాబు కు బెయిల్ ఇస్తుందా..? ఈరోజు కోర్ట్ లో ఏంజరగబోతుంది..?

Quash Petition Sc

Quash Petition Sc

మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Supreme Court) వేసిన క్వాష్ పిటిషన్‌ (Quash Petition) ఈ రోజు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా.ఎమ్.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు తరుపు లాయర్లు , ఏపీ ప్రభుత్వం తరుపు లాయర్లు వాదనలు కొనసాగనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభంకానుంది.. ఈ రోజు 45వ ఐటెమ్ గా లిస్ట్ చేసింది సుప్రీంకోర్టు.

ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు లాయర్లతో పాటు సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఇవాళ మరోసారి సీఐడీ లాయర్ వాదనలు, ఆ తర్వాత చంద్రబాబు లాయర్ కౌంటర్ వాదనలతో విచారణ ముగించబోతోంది. ఇక, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముకుల్ రోత్గి వాదనలు కొనసాగించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

2018 జూలైలో అవినీతి నిరోధక చట్టానికి పార్లమెంటు తీసుకొచ్చిన సెక్షన్ 17ఏ (17A) సవరణ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు లాయర్లు ఆయనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని వాదిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం వర్తించదని చెబుతోంది. ఇరువైపులా లాయర్లు తమ వాదనకు మద్దతుగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పుల్ని ప్రస్తావించారు. అలాగే ఈ కేసు విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా పలు ధర్మ సందేహాలు లేవనెత్తింది. గత శుక్రవారం సాగిన విచారణలో సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ సుదీర్ఘ వివరణలు ఇచ్చారు. అనంతరం ఈ కేసు విచారణ ఈరోజుకు వాయిదా పడింది. మరి ఈరోజు ఈ కేసు ఫై సుప్రీం కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుంది..? చంద్రబాబు కు బెయిల్ ఇస్తుందా..? ఇవ్వదా..? విచారణ వాయిదా వేస్తుందా..? అనేది చూడాలి. మరోవైపు.. ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.. దీంతో.. ఇవాళ చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణ ముగిసన వెంటనే.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కూడా విచారణ సాగనుంది.

Read Also : Ramoji Rao : మార్గదర్శి చీటింగ్ కేసు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రామోజీ రావు