Site icon HashtagU Telugu

Quash Petition : క్వాష్ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా..

Chandrababu Quash Petition

Chandrababu Quash Petition

Quash Petition : స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వేసిన క్వాష్ పిటిషన్‌ (Quash Petition)పై సుప్రీం కోర్ట్ (Supreme Court) మరోసారి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ఈరోజు కూడా కొనసాగాయి. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ స్కిల్‌ కేసు విచారణకు ఫైబర్‌ నెట్‌ కేసుతో సంబంధం ఉందన్నారు. మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్‌ తీసుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. కేసులపై కేసులు పెట్టి తమను సర్కస్‌ ఆడిస్తున్నారని వెల్లడించారు. ఇక్కడ కూడా 17ఏను ఛాలెంజ్‌ చేస్తున్నారా? అని లూథ్రాను జస్టిస్‌ త్రివేది ప్రశ్నించగా.. అవును 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని లూథ్రా తెలిపారు. ఇలా ఇరు వాదనలు విన్న కోర్ట్..వచ్చే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసింది.

Read Also : Ponnala as Jangaon BRS Candidate : జనగాం బీఆర్ఎస్ అభ్యర్థిగా పొన్నాల..?