Site icon HashtagU Telugu

AP : పెన్షన్‌ పంపిణీలో మరో కొత్త డ్రామా : చంద్రబాబు ప్రెస్‌ మీట్‌

Representatives of BPCL Corporation met with CM Chandrababu

Representatives of BPCL Corporation met with CM Chandrababu

Chandrababu: ఏపిలో మరోసారి పెన్షన్‌(Pension) పంపిణి విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏపి ప్రభుత్వం(AP Govt) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల వద్దకే పెన్షన్లు అందించాలని ఈసీ(EC) ఆదేశించినా ప్రభుత్వం సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిందని విపక్షాలు భగ్గుమనడం, విపక్షాలు వాలంటీర్లపై ఫిర్యాదు చేయడం వల్లే సచివాలయాల వద్ద ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే పలువురు వృద్ధులు ఎండవేడిమికి మరణించారని ప్రభుత్వం ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో డ్రామాలు చేస్తోందని చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు అధికారులు కుట్రలు, కుతంత్రాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని మండి పడ్డారు. వైసీపీ తీరుతో గత నెలలో 33 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హత్యల్లో కొందరు అధికారులు భాగస్వాములయ్యారని మండిపడ్డారు. పెన్షన్ల నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, అయితే పెన్షన్ తీసుకునే అందరి దగ్గర ఫోన్లు ఉండవు కదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఒక పార్టీ కోసం అధికారులు పని చేయటం ఏంటని ప్రశ్నించారు. పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేయాలని మరోసారి డిమాండ్ చేసారు. పంచాయతీ పరిధిలో ఒక్కో ఉద్యోగి 45 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తాడన్నారు. పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేదే ఇంటి వద్ద ఇస్తారు. ఇందులో తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యిందో లేదో ఎలా తెలుస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటూ మరో కొత్త డ్రామా మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని ఆకాంక్షించారు.

Read Also: Former MP Kanakamedala Ravindra Kumar : జగన్ కు కనకమేడల సూటి ప్రశ్న

ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ప్రమాదకరమని, ఎన్నికల సంఘం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒక్కడే ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని వాడుకోవచ్చునే విధంగా.. బస్సులు, గ్రౌండ్ వాడుకోవచ్చు అంటే కుదరదన్నారు. సభలకు బెదిరించి ఎక్కువమందిని తీసుకురావొచ్చని అనుకుంటున్నారని, ఇవన్నీ జరగడానికి వీల్లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఒకటేనని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.