టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu ) నాయుడు దాదాపు నాల్గు నెలల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకున్న చంద్రబాబు..దాదాపు 52 రోజుల పాటు జైల్లో గడిపి..ఈ మధ్యనే బెయిల్ ఫై బయటకు వచ్చారు. బెయిల్ నుండి బయటకు వచ్చిన కొద్దీ రోజులు ఆరోగ్యం ఫై దృష్టి సారించారు. ఆ తర్వాత దైవ దర్శనాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు పూర్తిగా రాజకీయ ఫై దృష్టి సారించారు. మార్చి నెలలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ వ్యవహారాలపై ఫోకస్ చేశారు.
ఈరోజు మీడియా (Media) తో మాట్లాడుతూ…కీలక విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని అందుకే ముఖ్యమంత్రి జగన్ హడావుడిగా చర్యలు మొదలుపెట్టాడని, 11 మంది ఇన్చార్జిలను ఇతర నియోజకవర్గాలకు మార్చేశాడని అన్నారు. ఒక చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు సెటైర్ వేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. పొత్తులో ఉన్నామని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని స్పష్టత ఇచ్చారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక విధానం వినూత్నంగా ఉండబోతోందని చెప్పారు. వైసీపీలోని అసంతృప్తులు తమకెందుకని అన్నారు. అక్కడ టిక్కెట్ రాలేదని తమ దగ్గరకు వస్తామంటే తమకు అవసరం లేదన్నారు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీసీల జపం చేస్తున్న జగన్ కు నిజంగా వారిపై అంత ప్రేమే ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తమ వ్యతిరేకతను బయటపెడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి-మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది… ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు… డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి ధీమా వ్యక్తం చేసారు. పక్క రాష్ట్రాల్లో ఉండేవాళ్లు ఈ రాష్ట్రంలో ఓటు వేయొద్దని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారని నిలదీశారు. జగన్ చేసేవన్నీ చెత్త పనులే అని మండిపడ్డారు. రుషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ. 500 కోట్లతో భవనం కడతారా అని అని నిలదీశారు. రుషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా అని ప్రశ్నించారు.
అలాగే అంగన్వాడీల న్యాయపోరాటానికి టీడీపీ అండగా ఉండనై భరోసా ఇచ్చారు. ఆందోళనలు అణచివేస్తామని అనడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఒక్క ఛాన్స్.. పాపం ప్రజలకు శాపంగా మారిందని.. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. 24 శాతం నిరుద్యోగంతో ఏపీ నంబర్ వన్‌గా ఉందన్నారు. ఇక ప్రజల్లో మార్పు మొదలైందని..ఇక యుద్ధమే అని తేల్చి చెప్పారు.
Read Also : Peanut Masala Rice: పల్లీ మసాలా రైస్ సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండిలా?