Site icon HashtagU Telugu

Chandrababu : ఐదు జిల్లాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన

Chandrababu Prajagalam Sabhas in Tirupati, Kadapa, Kurnool, Prakasam, Bapatla Districts

Chandrababu Prajagalam Sabhas in Tirupati, Kadapa, Kurnool, Prakasam, Bapatla Districts

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాగళం(PrajaGalam) ఎన్నికల ప్రచారం(Election campaign)లో వేగం పెంచారు. రెండ్రోజుల వ్యవధిలో ఐదు జిల్లాల్లో( five districts) సుడిగాలి ప్రచారం చేయనున్నారు. పలు ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.

Read Also: KTR : నమ్మించి మోసం చేసిన ద్రోహులు వారు – కేటీఆర్

మార్చి 30, 31 తేదీల్లో చంద్రబాబు కడప, కర్నూలు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ రాత్రికి వింజమూరులో బసచేయనున్నారు.

షెడ్యూల్ ఇదిగో…

మార్చి 30..ఉదయం 10.15 గంటలకు వింజమూరు నుంచి హెలికాప్టర్ లో పయనం
ఉదయం 10.45 గంటలకు ప్రొద్దుటూరు చేరిక
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ లో ప్రజాగళం సభకు హాజరు
మధ్యాహ్నం 12.45 గంటలకు భోజన విరామం
మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు నాయుడుపేటలో ప్రజాగళం సభకు హాజరు
సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.00 వరకు శ్రీకాళహస్తిలో ప్రజాగళం సభకు హాజరు
రాత్రికి శ్రీకాళహస్తి టీడీపీ ఆఫీసులో బస

We’re now on WhatsApp. Click to Join.

మార్చి 31..ఉదయం 9.40 గంటలకు శ్రీకాళహస్తి నుంచి హెలికాప్టర్ లో పయనం
ఉదయం 11.15 గంటలకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేరిక
ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఎమ్మిగనూరు తేరు బజారులో ప్రజాగళం సభకు హాజరు
మధ్యాహ్నం 12.45 గంటలకు భోజన విరామం
మధ్యాహ్నం 3.10 గంటల నుంచి 4.30 గంటల వరకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరు… మార్కాపురం క్లాక్ టవర్ వద్ద సభ
సాయంత్రం 6.00 గంటల నుంచి రాత్రి 7.30 వరకు బాపట్లలో ప్రజాగళం సభకు హాజరు
బాపట్ల ఇంజినీరింగ్ కాలేజిలో రాత్రి బస