Chandrababu : ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ – చంద్రబాబు

"నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది.

Published By: HashtagU Telugu Desk
Cbn Speech Tanuku

Cbn Speech Tanuku

ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటూ చంద్రబాబు (Chandrababu) కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తణుకు (Tanuku)లో ఏర్పాటు చేసిన ప్రజాగళం (Prajagalam) బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు.

అధికారం అంటే దోపిడీ అని జగన్‌ అనుకున్నారని .. అందుకే ప్రజల ఆస్తులను దోచేశారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కేసులు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. “నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది.రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులే అని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు కలిశాయి. జెండాలు వేరైనా.. అజెండా ఒక్కటే. జగన్ ను భూస్థాపితం చేయడమే ప్రధాన లక్ష్యం. చీకటి పాలనను అంతం చేయడానికి ఓట్లు చీలకూడదని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ కు పారిపోతాడు. జగన్ చేతిలో చిప్ఫ పట్టుకుని ఎక్కడికి పోతాడో అప్పుడే చెప్పను.. పవన్ కళ్యాణ్, నేను చేసి చూపిస్తాం. 2014 నుంచి 2019వరకు ఏం జరిగిందో అర్దం చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎన్నికల్లో గెలవడానికి జగన్ ముద్దులు పెట్టారు. హగ్గులిచ్చారు. ఇప్పుడు పిడి గుద్దులు కురిపిస్తున్నారు. ఏపీలోని ప్రతి పౌరుడిని అడుగుతున్నా. అభివృద్ధి కావాలా? సంక్షోభం కావాలా.. నిర్ణయించుకోండి ” అంటూ చంద్రబాబు ఓటర్లలో జోష్ నింపారు.

We’re now on WhatsApp. Click to Join.

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతం రూ.5వేల నుంచి 10వేలకు పెంచుతామని, ఎవ్వరు కూడా రాజీనామా చేయొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వాలంటీర్లను చెడగొట్టాలని జగన్‌ చూస్తున్నారని, అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధ పెడతామని హామీ ఇచ్చారు. దొంగలు సృష్టించే నకిలీ వార్తలు నమ్మవద్దని, కూటమి తరఫున నిర్దిష్ట అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారు.

Read Also : Prasanna Kumar : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ తీరుతో విసిగిపోయిన ప్రసన్నకుమార్ కాంగ్రెస్‌లోకి

  Last Updated: 10 Apr 2024, 08:30 PM IST