అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు. భవనాలు బూజు పట్టిపోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది’ అని చెప్పుకొచ్చారు.
రాజధాని అమరావతి (Amaravati ) ప్రాంతంలో సీఎం చంద్రబాబు (Chandrababu) పర్యటించారు. ఉదయం 11:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది. ముందుగా జగన్ కక్షగట్టి కూల్చేయించిన ప్రజావేదికను చంద్రబాబు సందర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఉద్దండరాయునిపాలెంలో అమరావతికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను పరిశీలించి..భవనాల పరిస్థితి తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. 1,631 రోజులు రైతులు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందిన్న ఆయన… A అంటే అమరావతి, P అంటే పోలవరం అని చెప్పుకొచ్చారు. అలాంటి అమరావతి ఏపీ ప్రజలందరి చిరునామా అని , దానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. ‘జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. అమరావతిపై నిత్యం విష ప్రచారం చేశారు. అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లు చూశాం. అందుకే జగన్ లాంటి సీఎం అవసరం లేదని ప్రజలు విసిరికొట్టారు’ అని చంద్రబాబు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
అమరావతి ప్రాంతంలో పైపులు, రోడ్డు, మట్టిని దొంగతనం చేస్తున్నా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. దుర్మార్గమైన పాలన నుంచి అమరావతిని దేవుడే కాపాడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ఓట్లేసి మద్దతు పలికిన వారు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ‘దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న జగన్ లాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వారు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? అని విచక్షణతో ఆలోచించాలి’ అని సూచించారు.
అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ‘వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన MLA, MLC క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు. భవనాలు బూజు పట్టిపోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది’ అని అన్నారు. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది…? పనులు ఎప్పటిలోపు అవుతాయనే దానిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత… ఓ అంచనాకు వస్తామని తెలిపారు. అలాగే అమరావతి ప్రజా రాజధాని.. విశాఖ ఆర్ధిక రాజధాని. కర్నూల్‌ను మోడల్ సిటీగా మారుస్తాం. రాయలసీమ సహా రాష్ట్రవ్యాప్తంగా పదకొండు కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించాం” అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
అలాగే గత ప్రభుత్వంలో పని చేసిన విధంగా అధికారులు వ్యవహరించవద్దని చంద్రబాబు కోరారు. ప్రజాహితం కోసం పని చేసే అధికారులకు అండగా ఉంటామని , పని చేసే అధికారులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటుందన్నారు.
Read Also : Best Phones Under 25K: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న స్మార్ట్ ఫోన్స్?