Site icon HashtagU Telugu

Raa Kadali Raa : నేను సీమ బిడ్డనే..నాది రాయలసీమ రక్తమే – పీలేరు సభలో చంద్రబాబు

Cbn Pileru

Cbn Pileru

పీలేరు ‘రా.. కదలిరా’ సభలో సీఎం జగన్ ఫై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఉచిత హామీలు ప్రకటించి ప్రజలను టీడీపీ వైపు తిప్పుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ‘రా.. కదలిరా’ (RAA KADALI RAA) పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఈరోజు పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండ (Uravakonda )లో పర్యటిస్తున్నారు. కొద్దీ సేపటిక్రితం పీలేరు సభలో చంద్రబాబు ప్రసంగించారు. సీఎం జగన్ రాజకీయ వ్యాపారి గా మారిపోయారని , మద్యంపై ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్లో లెక్కేసుకోవడమే ఆయన పని గా పెట్టుకున్నారని బాబు అన్నారు.’నాణ్యత లేని మద్యం వల్ల రాష్ట్రంలో 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. మద్యం విక్రయాలపై డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవో జగన్ చెప్పాలి. మద్య నిషేధం అని చెప్పి మాట తప్పిన వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదు’ అని దుయ్యబట్టారు.

అబద్ధాల్లో సీఎం జగన్ పీహెచ్డీ చేశారని, రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన పాలసీ అని మండిపడ్డారు. ‘నా పాలనలో అప్పుల మోత, పన్నుల వాత లేదు. ప్రస్తుతం పేదవాడి బతుకు చితికిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. బటన్ నొక్కుడులో ఎంత దోచుకున్నారో జగన్ చెప్పాలి. నాడు లేని అప్పులు ఇప్పుడు ఎందుకొచ్చాయో సమాధానం ఇవ్వాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ అధికార అహంకారాన్ని దించేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. నేను కూడా రాయలసీమ బిడ్డనే. నాలో ఉండేది సీమ రక్తమే. అందుకే ఈ ప్రాంతాన్ని రతనాల సీమ చేయడానికి సాగు నీటి కోసం రూ.12,500 కోట్లు ఖర్చు చేశా. జగన్ సీమ కోసం ఏం చేశారో చెప్పాలి. వచ్చే కురుక్షేత్ర యుద్ధానికి మేం సిద్ధం. గెలుపు TDP-JSPదే’ అని పేర్కొన్నారు.

Read Also : AP Elections 2024: ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల ప్రచారం