TDP : `మినీ మ‌హానాడు`ల‌తో హైప్

రాజ‌కీయాల్లో ఇటీవ‌ల బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న, మైండ్ గేమ్ బాగా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఒంగోలు మ‌హానాడు సూప‌ర్ హిట్ అయిన త‌రువాత ఏపీ రాజ‌కీయాల్లో కొంత మార్పు క‌నిపిస్తోంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఎంతో కాలం లేద‌నే సంకేతాన్ని బ‌లంగా టీడీపీ తీసుకెళ్లింది.

  • Written By:
  • Updated On - June 15, 2022 / 05:45 PM IST

రాజ‌కీయాల్లో ఇటీవ‌ల బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న, మైండ్ గేమ్ బాగా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఒంగోలు మ‌హానాడు సూప‌ర్ హిట్ అయిన త‌రువాత ఏపీ రాజ‌కీయాల్లో కొంత మార్పు క‌నిపిస్తోంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఎంతో కాలం లేద‌నే సంకేతాన్ని బ‌లంగా టీడీపీ తీసుకెళ్లింది. అదే టెంపోను ఎన్నిక‌ల వ‌ర‌కు తీసుకెళ్ల‌డానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌మాయాత్తం అయ్యారు. ప్ర‌తి జిల్లాలోనూ ల‌క్ష మందికి త‌గ్గ‌కుండా మినీ మ‌హానాడుల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు. ఆ మేర‌కు స‌భ‌ల‌ను స‌క్సెస్ చేయ‌డానికి క్యాడ‌ర్, లీడ‌ర్ల‌కు దిశానిర్దేశం చేశారు.

జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ‘ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా` టాగ్ తో చంద్ర‌బాబు వెళుతున్నారు. అనకాపల్లి జిల్లా నుంచి ఈ ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మినీ మహానాడును అక్క‌డ రెండు ల‌క్ష‌ల మందికితో నిర్వ‌హించ‌డానికి సిద్ధం అయ్యారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో తొలి మినీ మహానాడు జరగనుంది.

 

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు జిల్లాల పర్యటన కొనసాగనుంది. ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు ఉంటారు. ఆ మూడు రోజుల్లో తొలిరోజు మినీ మహానాడు ఉంటుంది. రెండో రోజు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఉండేలా ప్లాన్ చేశారు. మూడో రోజు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడుపై రోడ్ షోలు నిర్వహిస్తారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడమే లక్ష్యంగా ఈ పర్యటనలు చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 100 నియోజకవర్గాల్లో పర్యటించాలనే లక్ష్యాన్ని చంద్రబాబు నిర్దేశించుకున్నారు. వ‌చ్చే ఏడాది మ‌హానాడు వ‌ర‌కు మినీ మ‌హానాడుల‌ను కొన‌సాగిస్తారు.

ఒంగోలు మ‌హానాడు టెంపో ఏ మాత్రం త‌గ్గ‌కుండా బ‌ల‌ప‌ద‌ర్శ‌న చేయాల‌ని స్కెచ్ వేశారు. దీంతో వైఎస్సార్ పార్టీ ప్లీన‌రీ ఎఫెక్ట్ కూడా నామ‌మాత్రంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తం మీద చంద్ర‌బాబు జ‌నంతో కూడిన బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న ద్వారా వైసీపీ మైండ్ గేమ్ ను అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. ఆ దిశ‌గా విజ‌యం సాధించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసిన ఆయ‌న అన‌కాప‌ల్లి జిల్లాలో రెండు లక్ష‌ల మందితో శంఖారావాన్ని పూరించా