Chandrababu Naidu : బాబు లెఫ్ట్ రైట్ !

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ముందుచూపుతో క్యాడ‌ర్ ను సిద్ధం చేస్తుంటాడు. దీర్ఘ‌కాలిక పోరాటాల‌ను ర‌చించ‌డంలోనూ ఆయ‌ను అనుభ‌వం అపారం. జ‌గ‌న్ స‌ర్కార్ మీద ఎడ‌తెగ‌ని నిర‌స‌న‌ల‌కు ప్లాన్ చేస్తున్నాడు. కొత్త ఏడాదిని ఎన్నిక‌ల ఇయ‌ర్ గా ఆయ‌న భావిస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ముందుచూపుతో క్యాడ‌ర్ ను సిద్ధం చేస్తుంటాడు. దీర్ఘ‌కాలిక పోరాటాల‌ను ర‌చించ‌డంలోనూ ఆయ‌ను అనుభ‌వం అపారం. జ‌గ‌న్ స‌ర్కార్ మీద ఎడ‌తెగ‌ని నిర‌స‌న‌ల‌కు ప్లాన్ చేస్తున్నాడు. కొత్త ఏడాదిని ఎన్నిక‌ల ఇయ‌ర్ గా ఆయ‌న భావిస్తున్నాడు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని బాబు అంచ‌నా వేస్తున్నాడు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ సిద్ధంగా ఉండాల‌ని క్యాడ‌ర్ ను స‌మాయాత్తం చేస్తున్నాడు. ఆ క్ర‌మంలో ఈనెల 7, 11వ తేదీల్లో ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చాడు.ఏపీలోని లా అండ్ ఆర్డ‌ర్ మీద పెద్ద ఎత్తున ఇప్ప‌టికే టీడీపీ నిర‌స‌న‌ల‌ను తెలిపింది. ఢిల్లీ కేంద్రంగా ఇదే అంశాన్ని లేవ‌నెత్తింది. రూల్ ఆఫ్ లా క‌నిపించ‌డంలేద‌ని హైకోర్టు కూడా వ్యాఖ్యానించ‌డంతో టీడీపీ వాయిస్ కు బ‌లం వ‌చ్చింది. తొలి నుంచి శాంతి భ‌ద్ర‌త‌ల‌పై చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నాడు. కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల నుంచి పార్టీ ఆఫీస్ ల ధ్వంసాన్ని ఢి్లీకి చేర్చాడు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాధాపై రెక్కీ అంశాన్ని ప్ర‌చారంలోకి విస్తృతంగా తీసుకెళ్లాడు. ఆ సంఘ‌ట‌న‌పై డీజీపీ వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరును నిర‌సించాడు. ఈనెల 7వ తేదీన ఏపీ వ్యాప్తంగా లా అండ్ కంట్రోల్ త‌ప్ప‌డంపై ఆందోళ‌న చేయాల‌ని క్యాడ‌ర్ కు బాబు పిలుపునిచ్చాడు.

Also Read : కాపు’ కోట ర‌హ‌స్యం

కోవిడ్ సంద‌ర్భంగా సామాన్యులు చితికిపోయారు. జీవ‌నం సాగించ‌డ‌మే క‌ష్టంగా ఉంది. ఈ ప‌రిస్థితుల్లో పెరిగిన ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా ఈనెల 11 తేదీ ఆందోళ‌న‌కు దిగాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించాడు. ఆ మేర‌కు క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశాడు.సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావాన్ని సామాన్యులు నేరుగా అనుభవిస్తారు. ఆ స‌మ‌యంలోనే ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఆందోళ‌న చేస్తే సానుకూల ఫ‌లితాలు ఉంటాయ‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది. అందుకే ఈనెల 11న ధ‌ర్నాల‌కు పూనుకోవాల‌ని బాబు ఆదేశించాడు.సంక్రాంతి త‌రువాత సంస్థాగ‌త మార్పులు వేగంగా చేయాల‌ని బాబు భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది. క‌నీసం 100 అసెంబ్లీ స్థానాల‌కు సంబంధించిన రివ్యూ చేసిన త‌రువాత ఒక నిర్ణ‌యానికి రానున్నాడ‌ట‌. ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఇంచార్జిల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా మిగిలిన వాటిలోనూ ఇంచార్జిల‌ను నియ‌మించడానికి క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. గ‌తంలో మాదిరి కాకుండా ఈసారి ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని బాబు భావిస్తున్నాడ‌ని పార్టీ వ‌ర్గాల టాక్‌. ఇప్ప‌టికే 25 ఎంపీ అభ్య‌ర్థుల‌పై ఒక క్లారిటీకి వ‌చ్చిన టీడీపీ త‌దుప‌రి ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డానికి సిద్ధం అవుతోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను తొలి విడ‌త 100 స్థానాల్లోని అభ్య‌ర్థుల‌కు క్లారిటీ రానుంది. మిగిలిన 75 స్థానాల్లో రెండో విడ‌త క్లారిటీ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. పొత్తుకు వెళ్ల‌డం కోసం 50 స్థానాల‌ను పెండింగ్ లో ఉంచుతార‌ని తెలుస్తోంది. కానీ, 25 స్థానాల‌కు మించి వ‌ద‌ల‌కుండా పొత్తును ఖ‌రారు చేసుకోవాల‌ని పొలిటిక‌ల్ రివ్యూ క‌మిటీ సూచిస్తోంద‌ట‌.క‌మ్యూనిస్టుల‌తో టీడీపీ ప్ర‌స్తుతం క‌లిసి పోరాడుతోంది. జ‌న‌సేన ఇటీవ‌ల ద‌గ్గ‌ర అవుతోంది. బీజేపీ కూడా ద‌గ్గ‌ర‌య్య‌యే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల ప‌రిణామాలు సూచిస్తున్నాయి. ఇటు లెఫ్ట్ అటు రైట్ పార్టీల స‌మీక‌ర‌ణాల దిశ‌గా అడుగులు వేస్తోన్న బాబు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంచేందుకు క్యాడ‌ర్ కు దీర్ఘ‌కాలిక పోరాట ప్ర‌ణాళిక‌ను ర‌చించారు. సో…ఇక జ‌గ‌న్ స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి కానుంద‌న్న‌మాట‌.

  Last Updated: 04 Jan 2022, 03:23 PM IST