Site icon HashtagU Telugu

Kotipally F3 Racing : బాబు ఎఫ్ 3 క్లోజ్‌

Kotiaplly F3 Racing

Kotiaplly F3 Racing

`హైద‌రాబాద్ కు వెళ్ల పాచిప‌ని చేయండి..సిగ్గుండాలి..పౌరుషం లేదా..నాకు వ‌చ్చే న‌ష్టం లేదు..ఇప్ప‌టికైనా ఆలోచించండి..` ఇవీ చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల జ‌రిగిన గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు. ఇదేంటి ఇలా చంద్ర‌బాబు మాట్లాడుతున్నాడు. మైండ్ పోయిందా? ఆయ‌న‌కు అనుకున్నారు. ఆయ‌న బాధ‌లో వాస్త‌వం ఉందా? లేదా? అనేది ఆ ఆర్టిక‌ల్ చ‌ద‌విన త‌రువాత మీరే నిర్థారించండి.ఈ1 ఫార్ములా రేస్ ఈవెంట్ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప‌రుగులు పెడుతోంది. ఇలాంటి ఈవెంట్ ల తో ఏపీ రాష్ట్రానికి వ‌చ్చే ఇమేజ్ చంద్ర‌బాబుకు తెలుసు. అందుకే, ఫార్ములా త్రీ ప్రాజెక్టు ఆయ‌న క‌న్న ఓ కలల ప్రాజెక్టు. అమ‌రావ‌తి రేస్ రిసార్ట్‌ ప్రాజెక్టు రూపంలో స్వ‌ర్ణాంధ్ర ప్ర‌దేశ్‌లో సాకారం చేయాల‌ని అనుకున్నాడు. ఫార్ములా వ‌న్ (ఎఫ్ 1)కు ప్ర‌తి రూపంగా… వేగం విష‌యంలో స్వ‌ల్ప మార్పుల‌తో ఫార్ములా త్రీ గా మారిన విష‌యం ఆయ‌న‌కు తెలుసు. అమరావతికి దాన్ని తీసుకురావాల‌ని ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం అందరికీ తెలుసు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆనాడు రాష్ట్రానికి ఫార్ములా వన్ తీసుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నం ఈ రూపంలో సఫలం కానుంద‌ని భావించారు. ఇందుకోసం ఆనాటి ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రాజెక్టును సిద్దం చేసారు. అనంత‌ర‌పురం జిల్లా కోట‌ప‌ల్లి గ్రామంలో ఇందుకు అవ‌స‌ర‌మైన భూమిని గుర్తించ‌డంతో పనులు వేగంగా జ‌రిగాయి.

ప్ర‌భుత్వ ప్ర‌వేటు భాగ‌స్వామ్యంలో ఈ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని త‌ల‌పోశారు. దేశీయంగా నిధి మార్క్‌క్యూ ఒన్ మోటార్స్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వ‌హించాల‌ని కూడా నిర్ణ‌యించారు. అంత‌ర్జాతీయ స్ధాయిలో డ్రైవెన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్‌, మోటార్ స్పోర్ట్ ఫార్ములా అప‌రేట‌ర్స్ వంటి సంస్ధ‌ల స‌హ‌కారంతో ఈ ఫార్ములా త్రీ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని ప‌ర్యాట‌క శాఖ భావించింది. సాధార‌ణంగా ఫార్ములా వ‌న్ స్ధాయిలో కార్ల వేగం 350 నుండి 400 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉండ‌గా, ఫార్ములా త్రీలో అది గంట‌కు 250 కిలోమీట‌ర్ల‌కే ప‌రిమితం అవుతుంది. దాదాపు 3.3 కిలో మీట‌ర్ల మేర కార్ రేసింగ్ కోసం ప్ర‌త్యేకంగా ట్రాక్ రూపొందించ‌డానికి ప్రాజెక్టు సిద్ధం అయింది.ట్రాక్ వెంబ‌డి ప‌ర్యాట‌క సొబ‌గులు ఉండేలా డిపిఆర్ సిద్దం చేయ‌గా, దానిని అనుస‌రించి ఆధునిక రిసార్ట్ సౌక‌ర్యం, మ‌ధ్య స్ధాయి కాన్ప‌రెన్స్ సౌక‌ర్యాలు, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో అత్యాధునిక సౌండ్ అండ్ లైటింగ్ షో వంటి ప‌ర్యాట‌క సౌక‌ర్యాలు ఉంటాయి. మ‌రో వైపు కార్ల ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వివిధ సంస్ధ‌ల ఏర్ప‌టును సైతం ప్రోత్స‌హించేలా ప్రాజెక్టును సిద్దం చేసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా ప‌ర్యాట‌క కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా మీడియాకు ఆనాడు వెల్ల‌డించాడు.

జాతీయ, అంత‌ర్జాతీయ స్ధాయి ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌ట‌మే ప్ర‌ధాన ధ్యేయంగా ఈ కార్ రేసింగ్ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. ప‌ర్యాట‌క ప్రాజెక్టుల వ‌ల్ల ప‌రోక్షంగా ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు పెర‌గాల‌న్న బాబు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఫార్ములా త్రీ ఏర్పాటు వ‌ల్ల దాదాపు 300 మందికి ప్ర‌త్య‌క్షంగా ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయని అంచ‌నా వేశారు. ప‌రోక్షంగా మ‌రో 500 మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని భావించారు. 18 నెల‌ల్లో మొద‌టి ద‌శ ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేయాల‌ని బాబు ల‌క్ష్యాన్ని నిర్దేశించాడు. ఫ‌లితంగా అనంత‌రంపురం జిల్లాలోని కోట‌ప‌ల్లి ప్రాంతం ఆర్ధికంగా ముందడుగు వేస్తుంద‌న‌టంలో సందేహం లేద‌ని అధికారులు ఊహించారు. ఎఫ్ 3 ప్రాజెక్టు మొద‌టి ద‌శ పూర్తి అయిన ఆరునెల‌ల వ్య‌వ‌ధిలో జాతీయ, అంత‌ర్జాతీయ స్ధాయి కార్ రేస్‌లు ప్రారంభం చేసేలా బాబు ప్ర‌ణాళిక సిద్ధం చేశాడు. కానీ, 2019 ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స్ అయింది. చంద్ర‌బాబు ఊహించుకున్న ఎఫ్ 3 ఉనికిలేకుండా పోయింది. ఇప్పుడు చెప్పండి చంద్ర‌బాబు గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మైండ్ దొబ్బి మాట్లాడిన మాట‌లా? లేక ఆయ‌న బాధ ఎందుకో..? నిర్థారించుకోండి.