Macherla : పిన్నెల్లి అనుచరుల దాడిలో గాయపడిన శేషగిరిరావుకు బాబు ఫోన్..

దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు..ఎంతో ధైర్యం చేసి..పిన్నెల్లి అనుచరులను అడ్డుకున్నాడు..ఒకానొక సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఎదురుతిరిగాడు

  • Written By:
  • Publish Date - May 22, 2024 / 07:36 PM IST

మాచర్ల ఎమ్మెల్యే (Macherla YCP MLA ) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం (EVM) ను ధ్వంసం చేసిన ఘటనపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాధ్యతాయుత పదవిలో ఉండి.. ఇలా వీధి రౌడీలా వ్యవహరించారని యావత్ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన ఫై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కాగా ఈ దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు..ఎంతో ధైర్యం చేసి..పిన్నెల్లి అనుచరులను అడ్డుకున్నాడు..ఒకానొక సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఎదురుతిరిగాడు. దీనికి ప్రతీకారంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు నంబూరి శేషగిరిరావు ఫై దాడి చేసారు. ఈ దాడి లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా శేషగిరిరావు కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతే కాదు పోలింగ్ బూత్ వద్ద ఒక మహిళ కూడా పిన్నెల్లి నిలదీసింది. దీంతో వారు వారిపై దాడి చేశారని టిడిపి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.
We’re now on WhatsApp. Click to Join.

ఈ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఇస్నాపూర్‌ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఇస్నాపూర్‌ లొకేషన్‌ గురించి పటాన్‌చెరు పోలీసులను అడిగిన ఏపీ పోలీసులు ఇస్నాపూర్‌ వరకు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకొని పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also : Pithapuram : పిఠాపురంలో వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లుకు పాల్పడే అవకాశం – వర్మ