చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని నారాయణపురంలో శిరీష (Sirisha) అనే మహిళ పై జరిగిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పందించారు. అప్పు తీర్చలేదని శిరీషను చెట్టుకు కట్టేసి దారుణంగా వేధించిన ఘటన విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, స్వయంగా బాధితురాలికి ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు, ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆమెకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు, ముగ్గురు పిల్లల చదువుకు పూర్తి హామీ ఇచ్చారు.
Starbucks: స్టార్‌బక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా చాయ్‌వాలా.. అసలు నిజమిదే!
ఫోన్ కాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, శిరీషకు ధైర్యం చెప్పారు. “ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో జరిగే ప్రసక్తే రాకూడదు. మానవత్వం లేని వ్యక్తులు చేసే ఈ పనులకు కఠినంగా శిక్షిస్తాం. నీ పిల్లలు బాగా చదవాలి, ఏటు సమస్య వచ్చినా ప్రభుత్వం నీ వెంటే ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. పిల్లల చదువు వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, విద్య కోసం ఎలాంటి ఇబ్బంది పడకూడదని అధికారులను ఆదేశించారు. అప్పు ఒత్తిడిలో ఉన్న ఆమె పరిస్థితిని సీఎం సమగ్రంగా గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకున్నారు.
Virat Kohli London House: టీమిండియా ఆటగాళ్లకు లండన్‌లో విందు ఏర్పాటు చేసిన విరాట్ కోహ్లీ!
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులు అందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రత కల్పించాలన్నారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. “ఇలాంటి దుర్మార్గపు ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు” అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు.