టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu ).. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని (AP CS Jawahar Reddy) ఫోన్ చేసారు. రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీలో పింఛన్ పంపిణీపై రాజకీయ రంగు అల్లుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్‌లతో పింఛన్ పంపిణీ చేయించవద్దని, ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వైసీపీ మరోవిధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. పింఛన్ పంపిణీకి చంద్రబాబు అడ్డు తగిలాడని, ఈసీకి టీడీపీనేతలే పిర్యాదు చేసారని..అందుకే పింఛన్ ఇవ్వలేకపోతున్నామని..ఇప్పుడే ఇలా ఉంటె ప్రభుత్వంలోకి టీడీపీ వస్తే ఇంకెలా ఉంటుందో చెప్పండి అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అధికార పార్టీ నేతలు మాటలు నిజమే కావొచ్చు అని పింఛన్ దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో జాప్యంపై టీడీపీ (TDP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం (Election Commission) ఎటువంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. వృద్దులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాల్సిన అసవరం ఉందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని వినతి చేశారు. ఎండల సమయంలో లబ్దిదారులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత వివరించారు. సచివాలయం సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేపట్టలన్నారు. ఏ ఒక్క లబ్దిదారుడికీ ఇబ్బంది లేకుండా వెంటనే పంపిణీ ప్రక్రియను చేపట్టాలని చంద్రబాబు ఫోన్‌లో తెలిపారు.
Read Also : Change Photo on Voter ID: ఇంట్లో కూర్చొనే ఓటర్ ఐడీ ఫోటోను మార్చుకోవచ్చు ఇలా.. ప్రాసెస్ ఇదే..!