Site icon HashtagU Telugu

CM Jagan: జగన్ కు శుభాకాంక్షల వెల్లువ, విష్ చేసిన చంద్రబాబు, పవన్, మహేశ్

Cm Jagan

Cm Jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM) కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరంలో సీఎం జగన్ మరిన్ని విజయాలు సాధించాలని, మంచి ఆరోగ్యం సాధించాలని ఆకాంక్షిస్తూ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా సీఎం జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంతోషం, విజయం, మంచి ఆరోగ్యంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను” అని మహేష్ ట్వీట్ చేశారు.

మహేష్ బాబు ప్రస్తుతం తన రాబోయే చిత్రం “గుంటూరు కారం” లో పని చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటి వరకు విడుదలైన పాటలు అభిమానుల్లో భారీ అంచనాలను ఏర్పరచడంతో పాటు సినిమాపై మరింత ఉత్కంఠ నెలకొంది.

ఇక జగన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి జగన్ కు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.