Site icon HashtagU Telugu

BJP Alliance to TDP : ఏపీలో బిజెపి పోటీ చేయబోతున్న స్థానాలు ఇవేనా..?

Pawan Babu Amith

Pawan Babu Amith

కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , చంద్రబాబు (Chandrababu) ల భేటీ ముగిసింది. త్వరలో ఏపీలో జరగబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి- టీడీపీ – జనసేన (BJP-TDP-Janasena) పార్టీలు కలిసి బరిలోకి దిగబోతున్నాయి. 2014 లో ఎలాగైతే పొత్తు తో విజయం సాధించారో..ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలనీ ఆయా పార్టీలు ఫిక్స్ అయ్యాయి. వైసీపీ పార్టీ ని ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే కుదరదని , కలిసి కట్టుగా వెళ్తేనే ఓడించగలం అని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్న జనసేన అధినేత పవన్..ఇప్పుడు బిజెపి తో పొత్తు పెట్టుకోవడం వెనుక కూడా ఎంతో కష్టపడ్డారు. తమ సీట్లను తగ్గించుకొని కూడా బిజెపి కి సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

గత కొద్దీ రోజులుగా సీట్లకు సంబంధించి మూడు పార్టీలలో చర్చలు నడుస్తుండగా..దీనిపై ఏదోకటి తేల్చాలని చెప్పి రెండు రోజుల క్రితం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ఢిల్లీకి వెళ్లి.. అమిత్‌షాతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం భేటీ ముగిసింది. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు సమాచారం. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టు సమాచారం. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం మూడింటిలో రెండు చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటి కొనసాగింది. త్వరలోనే పొత్తుతో పాటు సీట్లపై మూడు పార్టీలు అధికారిక ప్రకటన చేయనున్నాయి.

Read Also : Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుండి మరో బ్యానర్..