తెలంగాణ (Telangana) ఎన్నికల ఘట్టం ముగియడం తో ఇప్పుడు అంత ఏపీ ఎన్నికల (AP Elections) ఫై ఫోకస్ చేసారు. ఇదే క్రమంలో అక్కడి రాజకీయ పార్టీలు సైతం దూకుడు పెంచాయి. తెలంగాణ లో ఎలాగైతే పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ (BRS) ను వద్దనుకున్నారో..ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుందని..ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ (Jagan) రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడని..ఇంకో ఛాన్స్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ (TDP)చెపుతుంది. ఇదే క్రమంలో జనసేన పొత్తు..సీట్ల సర్దుబాటు ఫై ఓ నిర్ణయం తీసుకోవాలని చూస్తుంది.
తాజాగా ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..స్వయంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య దాదాపు 2 గంటల పాటు చర్చలు సాగాయి. పొత్తుల అంశం , సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల తాలూకా అంశాలు ఇలా అనేక విషయాల గురించి ఇరు అధినేతలు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జనసేన కు చంద్రబాబు భారీ ఆఫర్ ఇచ్చారట. 25 అసెంబ్లీ స్థానాలు , 2 ఎంపీ సీట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని చెప్పలేదని..ఆలోచించుకొని చెపుతా అన్నట్లు చంద్రబాబు కు చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు చెప్పింది బెస్ట్ డీల్ అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జనసేన పార్టీలో బలమైన అభ్యర్థులు 10 మందికంటే ఎక్కువ లేరు..ఇందులో రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే టాక్..ఇక మిగతా 15 స్థానాల్లో ఎన్నికల సమయానికి వైసీపీ నుండి జనసేన లో ఎవరైనా చేరితే వారికీ అవకాశం దక్కుతుంది. అందుకే చంద్రబాబు 25 స్థానాలు జనసేన కు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆఫర్ కు పవన్ కళ్యాణ్ ఓకే చెపుతారనే అంత భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక చంద్రబాబు – పవన్ భేటీ ఫై నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘‘ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది. అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి..? దాని కోసం ప్రత్యేక వ్యూహంపైనా ఓ సమష్టి కార్యాచరణ తీసుకున్నాం. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారు. వైసీపీని దీటుగా ఎదుర్కోవడమే కాకుండా, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగింది. అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతాం’’ అని చెప్పుకొచ్చారు.
Read Also : Hyderabad: హైదరాబాద్ లో మహిళపై గ్యాంగ్ రేప్, నలుగురు యువకులు అరెస్ట్