Site icon HashtagU Telugu

Chandrababu New Style : వైరల్ గా మారిన చంద్రబాబు నయా లుక్..

Cbnlook

Cbnlook

ఓ పక్క నిప్పుల కొలిమిలా ఎండ దంచికొడుతున్నఏమాత్రం లెక్కచేయకుండా తన వయసును సైతం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం వస్తున్న అంటూ ప్రజాగళం (Prajagalam) పేరుతో TDP అధినేత చంద్రబాబు( Chandrababu) రేయిపగలు కష్టపడుతున్నారు. ఈ వయసులో ఆయన కష్టాన్ని చూసి అయ్యో అంటూ పార్టీ శ్రేణులు భావిస్తే..ఓ సైకో ను గద్దె దించాలంటే తప్పదంటూ మరికొంతమంది శ్రేణులు అంటున్నారు. గత కొద్దీ రోజులుగా బాబు వరుస పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ..ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.

ఈరోజు ప్రజాగళం యాత్రలో సరికొత్త లుక్లో (Chandrababu New Look) కనిపించి ఆకట్టుకున్నారు బాబు. కృష్ణా జిల్లా పామర్రు(Pamarru )లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన నల్లటి అద్దాలు ధరించి ప్రజలకు అభివాదం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే ఈ అద్దాలు ధరించినట్లు తెలుస్తోంది. ‘బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో’ అంటూ టీడీపీ ఈ వీడియోను ట్వీట్ చేయగా..టీడీపీ శ్రేణులు , అభిమానులు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. అభివృద్ధికి ఓటు వేస్తారా? విధ్వంసానికి వేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ‘ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు తప్ప ఏమీ చేయలేదు. ఇలాంటి సంక్షోభం సృష్టించిన వైసీపీకి ఓటు వేస్తారా? అని బాబు అడిగారు. వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీ నేతలే టీడీపీలోకి వస్తున్నారని గుర్తు చేసారు. ‘రోడ్ల మీద గుంతలు పూడ్చలేని జగన్ 3 రాజధానులు కడతారంట. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క యువత హైదరాబాద్ కు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తాం.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు.

అలాగే దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పలువురు దివ్యాంగులు తమను కలిసిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘వైసీపీ పాలనలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు అండగా ఉంటాం. సాధారణ పెన్షన్లు కూడా నెలకు రూ.4వేలకు పెంచుతాం. మహిళలకు నెలకు రూ.1500 అందిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. అందరికీ ఇస్తాం’ అని చెప్పుకొచ్చారు.

Read Also ; Shepherd : బాబూ షెపర్డ్ కొంచెం చూసి కొట్టు…ఇలా అయితే బౌలర్లు ఏమైపోవాలి