Lulu Group : లూలూ గ్రూప్‌కు భూమి కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం

Lulu Group : లూలూ గ్రూప్ విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్లను నిర్మించేందుకు భూమిని కేటాయించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది

Published By: HashtagU Telugu Desk
Lulu Malls Ap

Lulu Malls Ap

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం హార్బర్ పార్క్ (Visakhapatnam Harbour Park)సమీపంలో గతంలో లూలూ గ్రూప్‌(Lulu Group)కు కేటాయించిన 13.83 ఎకరాలను తిరిగి అందజేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల (Release of GP) చేసింది. లూలూ గ్రూప్ విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్లను నిర్మించేందుకు భూమిని కేటాయించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీనికోసం ఏపీఐఐసీ ద్వారా భూకేటాయింపులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Ugadi Diary 2025 : తెలంగాణ సీఎం చేతులమీదుగా అర్చక ఉద్యోగ జేఏసీ డైరీ ఆవిష్కరణ

లూలూ గ్రూప్ పెట్టుబడులు, మాల్ నిర్మాణానికి ఎస్‌ఐపీబీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. 2017లో లూలూ గ్రూప్ విశాఖ బీచ్ రోడ్‌లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చి, అప్పటి టీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించింది. అయితే 2023లో వైసీపీ ప్రభుత్వం ఈ భూకేటాయింపులను రద్దు చేసింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, మళ్లీ లూలూ గ్రూప్ తన ప్రాజెక్ట్‌ను కొనసాగించేందుకు ముందుకు వచ్చింది. దీనిని పరిశీలించిన పరిశ్రమల శాఖ, భూ కేటాయింపులు చేయాలని ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేసింది.

Telangana New Ministers : తెలంగాణ కొత్త మంత్రులు వీరే..శాఖలు ఇవే !

ఈ నిర్ణయం విశాఖపట్నం అభివృద్ధిలో మరో కీలక ముందడుగు కానుంది. లూలూ గ్రూప్ ఏర్పాటు చేసే అంతర్జాతీయ స్థాయి మాల్, హైపర్ మార్కెట్లు నగర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనున్నాయి. పర్యాటక రంగానికి తోడు, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖపట్నం దేశంలో ఒక ప్రముఖ వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా ఎదగడంలో ఇది ముఖ్యమైన దశగా భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పెట్టుబడిదారులకు విశాఖపట్నంలో వ్యాపార అవకాశాలు పెరిగే అవకాశముందని పరిశ్రమల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  Last Updated: 26 Mar 2025, 10:11 PM IST