Chandrababu Birthday : చంద్రబాబు బర్త్‌డే.. విద్యార్థి నేత నుంచి సీఎం దాకా స్ఫూర్తిదాయక ప్రస్థానం

Chandrababu Birthday : ఇవాళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు.

  • Written By:
  • Updated On - April 20, 2024 / 10:53 AM IST

Chandrababu Birthday : ఇవాళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు. ఆయన 1950 ఏప్రిల్ 20న జన్మించారు. 1970వ దశకంలో యూత్ కాంగ్రెస్‌లో విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత చంద్రబాబు అంచెలంచెలుగా ఎదుగుతూ పలుమార్లు సీఎం పదవిని చేపట్టారు. సీఎం పోస్టు దాకా ఆయన అంత ఈజీగా చేరలేదు. దాని వెనుక ఎంతో శ్రమ, పట్టుదల, సహనం దాగి ఉన్నాయి. ఆయన బర్త్‌డే(Chandrababu Birthday) సందర్భంగా కథనమిది.

We’re now on WhatsApp. Click to Join

  • తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారావారిపల్లెలో నారా ఖర్జూర నాయుడు, శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు.
  • ఆరేళ్ల వయసులో  తమ ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాపురం గ్రామానికి నడిచి వెళ్లి చంద్రబాబు ప్రాథమిక విద్యను అభ్యసించారు.  ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చంద్రగిరిలోని ప్రభుత్వ స్కూల్లో చదివారు.పదోతరగతి టీపీఎం హైస్కూలులో చదువుకున్నారు.
  • ఆ రోజుల్లోనే తన సొంత ఊరులో వినాయక సంఘాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు  గ్రామాభివృద్ధి చేసే వారట.
  • చంద్రబాబు తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు.
  • చంద్రబాబు 1974లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు.
  • మొదట చంద్రగిరి యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశారు.
  • చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు.
  • తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాక..  1980లో చంద్రబాబుకు మంత్రి పదవి దక్కింది.

Also Read :Suicide Game : భారత విద్యార్థిని బలిగొన్న ‘సూసైడ్ గేమ్’.. ఏమిటిది ?

  • చంద్రబాబు మంత్రిగా ఉన్న టైంలో ఎన్టీఆర్ తనను తేనేటి విందుకు ఆహ్వానించారు. తొలి సమావేశంలోనే చంద్రబాబు తెలివితేటలు ప్రజల కోసం పరితపించే విధానాన్ని ఎన్టీఆర్ గుర్తించారు.
  • 1981 సెప్టెంబర్ 10న నారా భువనేశ్వరితో చంద్రబాబు వివాహాన్ని జరిపించారు.
  • 1982లో టీడీపీని ఎన్టీఆర్ స్థాపించగా.. చంద్రబాబు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
  • ఎన్టీఆర్ కోరిక మేరకు చంద్రబాబు 1983 చివరిలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో క్రమంగా పవర్‌ఫుల్ లీడర్‌గా ఎదిగారు.
  • 1984లో నాదెండ్ల భాస్కర్ రావు సంక్షోభాన్ని సృష్టించిన  సమయంలో ఎన్టీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టి ఎన్టీఆర్‌కు నీడలా ఆయన నిలబడ్డారు.
  • 1989 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కాాగా.. ఎన్టీఆర్ శాసనసభకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో అసెంబ్లీ భారాన్ని మొత్తం చంద్రబాబు తన భుజాన వేసుకున్నారు.
  • 1994 ఎన్నికలలో టీడీపీ ఘనవిజయాన్ని అందుకుంది. కుప్పం నుంచి ఎన్నికైన చంద్రబాబు ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
  • 1995లో ఎమ్మెల్యేల మద్దతుతో తొలిసారి ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. టీడీపీని కాపాడుకునే మంచి ఉద్దేశంతోనే చంద్రబాబు ఆనాడు అలా చేయాల్సి వచ్చిందని చెబుతుంటారు.
  • 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
  • 2003, 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు.
  • ఉమ్మడి ఏపీ  విభజన అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చారు.
  • 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది.   కేవలం 23 సీట్లకే పరిమితమైంది.
  • రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని అందరూ అనుకున్న తరుణంలో చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని ధీటుగా ఎదుర్కొనేలా జనసేన, బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు.