Site icon HashtagU Telugu

Chandrababu Scam: చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ మంత్రులు

Chandrababu Scam

New Web Story Copy 2023 09 07t225517.322

Chandrababu Scam: మాజీ సీఎం నారా చంద్రబాబుపై అవినీతి మారక అంటుకుంది. తాజాగా ఆయనపై ఐటీ పంజా విసిరింది. 118 కోట్ల అవినీతి సొమ్ము లెక్కకు రాలేదంటూ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో బాబు అరెస్ట్ ఖాయమంటూ కొందరు జోస్యం చెప్తుంటే అధికార పార్టీ కొందరు మంత్రులు మాత్రం అరెస్ట్ తద్యమంటూ స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే బాబుపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ సీఐడీ కూడా చంద్రబాబు అక్రమాస్థుల్ని తొవ్వే పనిలో పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం వదిలేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ఈ కేసుపై తాజాగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పందించాడు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 118 కోట్ల రూపాయలకేసులో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం ఖాయమని అన్నారు. తనను అరెస్టు చేసే అవకాశం ఉందని గ్రహించి చంద్రబాబు ప్రజల సానుభూతి పొందేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు నాయుడు తన భార్యకు అవమానం జరిగిందని బహిరంగంగా ఏడ్చేవారన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టి ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చేస్తుందని బాబు చెప్పిన మాటల్ని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి.

చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయమని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన అరెస్టును ప్రజలు సంబరాలు చేసుకుంటారని, దీంతో దివంగత ఎన్టీ రామారావుకు శాంతి చేకూరుతుందని ఆమె అన్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌ను జైలులో పెడితే ప్రజలకు మేలు జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చంద్రబాబును విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పుడల్లా సానుభూతి పొందేందుకు డ్రామాలు వేస్తుంటాడని రోజా అన్నారు. హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో పట్టుబడిన తర్వాత ఏపీకి వచ్చారని, ఆయన నాటకాల వల్ల సానుభూతి పొందలేరని ఆమె ఆరోపించారు. ఇదే క్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సిబిఎన్ పై విమర్శలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేస్తామన్నారు.

Also Read: Lord Shiva: శివుడికి బిల్వపత్రాలను ఎందుకు సమర్పిస్తారు.. ఈ నియమాలు తప్పనిసరి?