Site icon HashtagU Telugu

Rajdhani Files : రాష్ట్ర ప్రజలంతా “రాజధాని ఫైల్స్” చూడండి – చంద్రబాబు పిలుపు

R

R

ఏపీ రాష్ట్ర రాజకీయాలు (AP Politics) అంత సినిమాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండడం తో వరుస పెట్టి అధికార , ప్రతిపక్ష పార్టీలకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటీకే జగన్ కు సపోర్ట్ గా యాత్ర 2 (Yatra 2)మూవీ రాగా..ఇక ఈరోజు టీడీపీ(TDP) అనుకూలంగా “రాజధాని ఫైల్స్” మూవీ వచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా రాజధాని కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ మూవీ లో చూపించారు. అమరావతి కోసం 1500 రోజుల పైగా అలుపెరుగని పోరాటాన్ని చేస్తున్న ఉద్యమ నేపథ్యాన్ని, కేవలం 150 నిముషాల వ్యవధిలో అది కూడ సహజ సిద్ధంగా చిత్రీకరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే ఈ సినిమా ఫై టీడీపీ నేతలు స్పందించారు. సందేశాత్మకంగా ఉండే ఒక అర్థవంతమైన ముగింపు ఈ చిత్రానికి హైలైట్ అని , రాష్ట్ర ప్రజలంతా ఈ సినిమాని చూడాలని.. అలాగే చూసేలా మరో పది మందిని ప్రోత్సహించాలని అచ్చెన్నాయుడు ఇప్పటికే పిలుపునివ్వగా…తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ సినిమాను చూడాలని పిలుపునిచ్చారు. అమ‌రావ‌తిపై విడుద‌లైన రాజాధాని ఫైల్స్ పై ఆయ‌న స్పందిస్తూ, ఇది ఒక విషాదమని ‘ఎక్స్‌'(ట్విటర్‌)లో ఆయన పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశారని దుయ్యబట్టారు. ఈ కుట్రలు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అని పేర్కొన్నారు.

జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన రాజధాని.. దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజల కష్టాలను ఇందులో చూపించారని తెలిపారు. అందుకే ఈ చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారని విమర్శించారు. కానీ న్యాయస్థానంలో ఆ ఆటలు సాగలేదన్నారు. తెలుగు ప్రజలంతా థియేటర్లకు వెళ్లి ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూసి వాస్తవాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

Read Also : India: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్, మరో పార్టీ ఔట్