TDP Rally: గుడివాడ ‘ఇదేం ఖర్మ’ బంపర్ హిట్, పోటెత్తిన జనం

కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు సభకు జనం పోటెత్తారు. కొన్ని కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఆయన రోడ్ షో పొడవునా వేలాది మంది అనుసరించారు.

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 10:47 PM IST

TDP Rally: కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు సభకు జనం పోటెత్తారు. కొన్ని కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఆయన రోడ్ షో పొడవునా వేలాది మంది అనుసరించారు. నిమ్మకూరు నుంచి గుడివాడ వరకు సాగిన రోడ్ షో కనీవినీ ఎరుగని రీతిలో బంపర్ హిట్ అయింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా, చంద్రబాబు రోడ్ షో నిమ్మకూరు నుంచి గుడివాడ చేరుకుంది. ఈ నేపథ్యంలో, గుడివాడ శరత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు రోడ్ షో వైసీపీ కార్యాలయం మీదుగా వెళ్లాల్సి ఉండగా, వైసీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. వైసీపీ జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఫలితంగా హై టెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఓ దశలో ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో, భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అంతకుముందు, గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. రామనపూడి వద్ద గుడివాడ నియోజకవర్గంలోకి చంద్రబాబు రోడ్ షో ప్రవేశించింది. నియోజకవర్గ సరిహద్దుల వద్ద చంద్రబాబుకు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీ చేపట్టారు. రాత్రికి చంద్రబాబు గుడివాడ జనార్దనపురంలోని వీకేఆర్ కళాశాల ప్రాంగణంలోని సభలో ప్రసంగిస్తారు. గుడివాడలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతగా ఎన్ఎస్ జీ అదనపు బలగాలు రంగంలోకి దిగాయి.

అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గురువారం గుడివాడ చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇలాకాలో చంద్రబాబు రోడ్ షో, సభ భారీ విజయం అందుకుంది. అయితే, గుడివాడలో కొడాలి నాని కార్యాలయం వద్ద ఈ సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది.
కొడాలి నాని కార్యాలయం వద్దకు వైసీపీ, టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇరు పార్టీల వర్గీయులు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో, పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో గుడివాడకు తరలించారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు పోలీసులను బృందాలుగా విభజించి రూట్లు నిర్దేశించారు.

అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం పేర్నినాని అడ్డాలో రోడ్‌షో నిర్వహించిన బాబు.. ఈరోజు కొడాలి నాని ఇలాఖాలోకి అడుగు పెట్టారు.. గుడివాడలో రోడ్ షో.. సభ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. బందరులో ఇదేం ఖర్మ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న చంద్రబాబు జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. బటన్‌ నొక్కి జగన్‌ 2 లక్షల కోట్లు బొక్కేశారన్నారు. పులివెందులలో బస్టాండ్‌ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు. అటు పేర్నినాని, వల్లభనేని వంశీపైనా సెటైర్లు వేశారు.

జగన్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ ధనిక సీఎం అని డేటా వచ్చిందని.. ఈయన పేదల ప్రతినిధి ఎలా అవుతారని అన్నారు బాబు. రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆయన ధనికుడు అవుతున్నారన్నారు. జగన్‌ కొత్తగా స్టిక్కర్లు వేస్తున్నారని.. ఆయన నమ్మకం కాదు శాపం అంటూ మండిపడ్డారు. వైనాట్‌ కుప్పం కాదు.. పులివెందులలో గెలిచి చూపించామన్నారు చంద్రబాబు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు సత్తా చూపించారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామన్నారు బాబు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసే క్రమంలో చంద్రబాబు పర్యటన కీలకం కానుంది. అదే సమయంలో జిల్లాలోని గన్నవరం.. గుడివాడపైన టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉంది.

దీంతో.. గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర పర్యటనపైన ఆసక్తి నెలకొంది. గురువారం మధ్యాహ్నం చంద్రబాబు నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి బస్ స్టాండ్ సెంటర్, నెహ్రూ చౌక్, గుడివాడ బైపాస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో సాగింది. గుడివాడలో చంద్రబాబు పాదయాత్రకు దిగారు. గుడివాడలోని వీకేఆర్, కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. గుడివాడలో కొంత కాలంగా కొడాలి నాని వర్సస్ టీడీపీ రాజకీయం ఇప్పుడు చంద్రబాబు పర్యటనతో కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

మచిలీపట్నం రోడ్ షో లో చంద్రబాబుకు స్వాగతం చెప్పే ర్యాలీలో ఎన్టీఆర్‌ అభిమానులు హడావుడి చేశారు. హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, తారకరత్న ఫోటోలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. పెనమాలూరు, గూడూరులలో ఎన్టీఆర్‌ అభిమానులు హల్‌చల్‌ చేయడం పార్టీ వర్గాలకు ఇబ్బంది కరంగా మారింది. జై బాబు అంటూనే జై ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు అభిమానులు.
ముందు గూడూరు జంక్షన్‌లో హైటెన్షన్‌ నెలకొంది. మంత్రి జోగి రమేశ్‌ కోసం వైసీపీ శ్రేణులు.. ఇటు చంద్రబాబు కోసం టీడీపీ శ్రేణులు.. భారీ గజమాలలతో రోడ్డెక్కడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే, ముందుగా జోగి రమేశ్‌ రావడంతో… ఆయనకు భారీ గజమాలతో సత్కరించారు వైసీపీ నాయకులు. టీడీపీ శ్రేణుల్ని భారీకేడ్లు అడ్డుపెట్టి నిలువరించారు పోలీసులు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోగి… ఏ ముఖం పెట్టుకుని తమ జిల్లాకు వచ్చారని నిలదీశారు. మొత్తం మీద మాజీ మంత్రులు కొడాలి, పేర్ని ఇలాఖలో చంద్రబాబు హిట్ కొట్టారు.