గుంటూరు నగర వాసులకు ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు మరో కీలక అడుగు పడబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈ నెల 7వ తేదీన గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా శంకర్ విలాస్ వద్ద ఓవర్ బ్రిడ్జి (Sankar Vilas Bridge) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా కీలక పరిష్కారం లభించనుంది.
Hydraa : హైదరాబాద్‌లో నిర్మాణాలు చేపట్టేవారికి హైడ్రా హెచ్చరికలు జారీ
ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధుల విషయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.98 కోట్లు మంజూరు చేయించారు. కేంద్రం నుండి నిధులు విడుదల కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పనులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతే గుంటూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో రాకపోకలు సాఫీగా జరిగే అవకాశముంది.
నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించి, అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. అభివృద్ధి పథంలో గుంటూరు నగరానికి ఇది మరో అడుగు కావడమే కాకుండా, ప్రజలకు మరింత సౌలభ్యం కలిగించే కార్యక్రమంగా భావిస్తున్నారు. అధికారికంగా పనులు ప్రారంభమైతే, ప్రజలకు ఊపిరి పీల్చే అవకాశం కలుగనుంది.