Site icon HashtagU Telugu

Chandrababu: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ధన్యవాదాలు: చంద్రబాబు

Chandrababu (2)

Chandrababu (2)

Chandrababu: తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏ తప్పూ చేయలేదని సీనియర్‌ రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు సంఘీభావం తెలిపి రోడ్లపైకి వచ్చి పోరాడారన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచి పోరాడిన వారి అభిమానాన్ని మరువలేనన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేశానన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల చాలా మంది లబ్ధి పొందారని చంద్రబాబు చెప్పారు. కొందరు కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు కూడా సంఘీభావం తెలిపారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేశారన్నారు . కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.

టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడారని తెలిపారు. హైదరాబాద్ నుంచి స్వచ్ఛందంగా వచ్చిన ఐటీ ఉద్యోగులు ఆయనకు సంఘీభావం తెలిపారు. దీనికి బాబు కృతజ్ఞతలు చెప్పారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు రిలీజ్ అయ్యారు. బాబు జైలు నుంచి బయటకు రావడం చూడగానే జై బాబు నినాదాలతో జైలు ప్రాంగణం అంతా అభిమానుల నినాదాలతో మార్మోగిపోయింది.

Also Read: Sago Idli : సగ్గుబియ్యం ఇడ్లీలు.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ !

Exit mobile version