Chandrababu : పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 03:36 PM IST

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)..జనసేన ధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు తెలియజేసారు. అలాగే యువగళం (Yuvagalam) పాదయాత్ర ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh) కు అభినందనలు తెలిపారు. నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న సందర్బంగా బుధువారం సాయంత్రం భోగాపురంలో సక్సెస్ సభ ను ఏర్పాటు చేసారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ , చంద్రబాబు , లోకేష్ , బాలకృష్ణ లతో పాటు జనసేన , టీడీపీ నేతలు , పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై సభను సక్సెస్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ.. దేశంలో పాదయాత్రలు, బస్సు యాత్రలు కొత్త కాదు, ప్రజల్ని చైతన్యం చేయడానికి నందమూరి తారకరామారావు చైతన్యయాత్ర చేశారు. కానీ పాదయాత్రలపై దండయాత్ర చేయడం తొలిసారి జగన్ పాలనలో చూశానంటూ మండిపడ్డారు. ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు నేత పాదయాత్ర చేస్తే, చేతనైతే సహకరించాలి.. లేకపోతే ఇంట్లో పడుకోవాలన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ నేతల్ని ఇబ్బందులకు గురిచేసింది వైసీపీ ప్రభుత్వం. త్వరలో అధికారంలోకి వచ్చి వడ్డీతో సహా జగన్ కు తిరిగిస్తామన్నారు. టీడీపీ, జనసేన రాష్ట్ర ప్రజలకు, యువతకు అండగా ఉంటుందని, ఉద్యోగాలు కల్పిస్తుందని భరోసా కల్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగుతమ్ముళ్లకు, జనసైనికులకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరోసారి పవన్ కళ్యాణ్, లోకేష్ లపై ప్రశంసలు కురిపించారు చంద్రబాబు. ‘యువగళంను దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేశ్ కు అభినందనలు. టీడీపీ పోరాటానికి మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే సంకేతాలను నిన్న జరిగిన యువగళం నవశకం చాటి చెప్పింది. టీడీపీ, జనసేన కలయికపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. రెండు పార్టీలు కలిసికట్టుగా ఏపీని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పునర్నిర్మిస్తాయి’ అని ట్వీట్ చేశారు. యువగళం విజయోత్సవ సభకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు.

Read Also : ECI – Derogatory Words : పొలిటికల్ లీడర్స్.. ప్రసంగాల్లో అలాంటి భాషను వాడొద్దు : ఈసీ