ఢిల్లీలో గొల్లుమ‌న్న చంద్ర‌బాబు.. 40ఏళ్ల అనుభ‌వానికి అవ‌మానం

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 02:09 PM IST

ఆప‌రేష‌న్ స‌క్సెస్ పేషెంట్ డెడ్ మాదిరిగా చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ ముగిసింది. అనుకున్న‌దానికి భిన్నంగా అక్క‌డి ప‌రిస్థితులు ఉన్నాయ‌ని టీడీపీ గ్ర‌హించింది. ఆల‌స్యం చేయ‌కుండా టీడీపీ చీఫ్ ఢిల్లీ నుంచి రాత్రికిరాత్రి ఇంటికి చేరుకున్నాడు. రాష్ట్ర‌ప‌తి కోవింద్ ను క‌లిసి ఏపీలోని దారుణ ప‌రిస్థితుల‌ను తెలియ‌డం మిన‌హా ఎలాంటి రాజ‌కీయ ప‌ర‌మైన ప్రొగ్రెస్ క‌నిపించ‌లేదు. రెండున్న‌రేళ్ల జ‌గ‌న్ పాల‌న మీద బుక్ లెట్ తో ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు సైలెంట్ గా తిరుగుముఖం ప‌ట్ట‌డం పార్టీ వ‌ర్గాల‌ను తిక‌మ‌క‌పెడుతోంది. రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన సంద‌ర్భంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌, ఎంపీ కేశినేని నాని ఇత‌ర రాష్ట్ర నాయ‌కులు చంద్ర‌బాబు వెంట క‌నిపించారు. సింహాలుగా టీడీపీ చెప్పుకుంటోన్న గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ అక్క‌డ క‌నిపించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ఒకటిన్న‌ర రోజు ఢిల్లీలోనే ఉన్న టీడీపీ చీఫ్ ఎలాగైన ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌ల‌వాల‌ని అనుకున్నాడు.


వాళ్ల అపాయిట్మెంట్ కోసం ప‌లు మార్గాల ద్వారా ప్ర‌య‌త్నం చేశాడు. తొలి ప్ర‌య‌త్నంలోనే ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి నిరాక‌ర‌ణ ఎదురైయింది. ఇక అమిత్ షా విష‌యంలో చివ‌రి వ‌ర‌కు ఆశ‌లు పెట్టుకున్న బాబు అండ్ టీంకు చేదుఅనుభ‌వాన్ని మిగిల్చింది. అపాయిట్మెంట్ ఖరారు అయింద‌నే రేంజిలో కొన్ని న్యూస్ చాన‌ళ్లు ఊద‌ర‌గొట్టాయి. ఇంకేముంది బీజేపీ, టీడీపీ క‌ల‌వ‌డానికి ఈ మీటింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఒక అడుగు ముందుకేసి కొన్ని ఊహాగాల‌ను అల్లాయి. కానీ, చివ‌ర‌కు 40ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు అవ‌మానంతో వెనుతిర‌గాల్సి వ‌చ్చింది.
ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల వాల‌కం స‌హ‌జ మిత్రునిగా ఉన్న ప‌వ‌న్ కు కూడా న‌చ్చ‌లేద‌ని టాక్‌. గ‌తంలో జన‌సేనానికి కూడా ఇలాంటి చేదుఅనుభ‌వం ఉంద‌ని చెబుతుంటారు. అందుకే, తెలుగోడి పౌరుషం, ఆత్మ‌గౌవ‌రం నిలుపుకోవ‌డం కోసం మ‌రోసారి ఎన్టీఆర్ త‌ర‌హా నినాదం అవ‌స‌ర‌మ‌ని రెండు పార్టీలు భావిస్తున్నాయ‌ట‌. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని టీడీపీతో క‌లిసి జ‌న‌సేన న‌డ‌వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల వినికిడి. అందులో భాగంగానే బ‌ద్వేల్ ఉప ఎన్నికల వైపు ప‌వ‌న చూడ‌లేదట‌. ఒంట‌రిగా పోటీ చేస్తోన్న బీజేపీకి బ‌ద్వేల్ నియోజ‌వ‌ర్గంలో ఎన్ని ఓట్లు వ‌స్తాయో..చూడాలి. అక్క‌డ వంద‌ల ఓట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయితే బీజేపీ మెట్టు దిగి..జ‌న‌సేన‌, టీడీపీతో జ‌త‌క‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.
మొత్తం మీద చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ ఏపీ రాజ‌కీయాల్లో పెనుమార్పుకు కార‌ణం అవుతుంద‌ని భావించిన వాళ్ల‌కు నిరాశే మిగిలింది. రాబోవు రోజుల్లో ఎవ‌రిదోవ వాళ్ల‌దే అనే సంకేతం బీజేపీ పెద్ద‌లు ఇవ్వ‌డం ఈ ప‌ర్య‌ట‌న‌లోని ఆంత‌ర్యం. భవిష్య‌త్ లోనూ చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఇష్టంలేని విష‌యాన్ని అపాయిట్మెంట్ రూపంలో బీజేపీ పెద్ద‌లు చెప్పేశారు. సో…టీడీపీ, జ‌న‌సేన ఇక ఏం చేస్తాయో..చూద్దాం.