ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) వెలగపూడిలో సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ (Bhumi Pooja) చేయబోతుండడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు తాత్కాలిక నివాసంపై విమర్శలు చేయడంతో, ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజధాని అమరావతిలోనే చంద్రబాబు ఇల్లు కట్టుకోబోతుండడం తో ఆయనకు అమరావతిపై ఉన్న నిబద్ధతను ప్రజలకు చూపించే అవకాశమొచ్చింది. ఈ నిర్ణయం ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ పదేపదే వేసిన విమర్శలకు సమాధానమనే చెప్పాలి.
Health Care Tips: వేసవిలో మామిడికాయ షేక్ ని తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
2024 ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు.. అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు మరింత స్పష్టతనిచ్చారు. అదే తరహాలో వెలగపూడిలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్కడ తన సొంత ఇంటిని నిర్మించాలని నిర్ణయించడం, రాజకీయంగా కూడా పెద్ద మార్పును సూచిస్తుంది. అమరావతి అభివృద్ధిపై నమ్మకం కోల్పోయిన రైతులకు, ఈ ఇంటి నిర్మాణం భరోసా కల్పిస్తుందనే అభిప్రాయం వ్యాప్తి చెందుతోంది. వైసీపీ హయాంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ఆగిపోవడంతో అక్కడి ప్రజలు నిరాశకు గురయ్యారు. కానీ ఇప్పుడు చంద్రబాబు తన ఇంటిని నిర్మించడం ద్వారా, అమరావతికి తిరిగి జీవం పోస్తున్న సంకేతాలను పంపిస్తున్నారు.
TDP Formation Day : టీడీపీ ఆవిర్భవించి 43 ఏళ్లు.. పార్టీ చరిత్రలో కీలక ఘట్టాలివీ
వెలగపూడిలో చంద్రబాబు ఇల్లు కట్టుకోవడం ద్వారా, టీడీపీ ఈ ప్రాంతాన్ని తన శక్తికేంద్రంగా మార్చుకోనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో తాడేపల్లిలో జగన్ తన అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు, ఇప్పుడు చంద్రబాబు వెలగపూడిలో ఇల్లు కట్టుకోవడం టీడీపీ బలం పెరిగినట్టు సంకేతాలిస్తున్నది. రాజధాని అభివృద్ధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, ఈ నిర్ణయం ఒక పెద్ద అడుగుగా చెప్పవచ్చు. దీని ద్వారా అమరావతి భవిష్యత్తు మళ్లీ వెలుగులోకి వచ్చి, అక్కడి ప్రజలకు కొత్త ఆశలు రేకెత్తించనుంది.