ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు(Chandrababu Naidu) అరెస్ట్(Arrest) తో ఏపీ అట్టుడుకుతోంది. ప్రభుత్వంపై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. టీడీపీ(TDP) నాయకులు, మిగిలిన ప్రతిపక్షాలు మీడియా ముందుకు వచ్చి అరెస్ట్ ని ఖండిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకి వచ్చి చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడారు.
ఇక ఉదయం నుంచి లోకేష్(Lokesh) చంద్రబాబుని కలవడానికి ప్రయత్నిస్తున్నా సీఐడీ అధికారులు ఛాన్స్ ఇవ్వట్లేదు. భార్య, పలువురు నాయకులు కలుద్దామనుకున్నా సీఐడీ అనుమతి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కలుద్దామని హైదరాబాద్ నుంచి బయలుదేరితే వెనక్కి పంపించేశారు. ఇక చంద్రబాబుని సిట్ కార్యాలయానికి తీసుకు వచ్చాక కుటుంబ సభ్యులు, నాయకులు కార్యాలయం బయటే ఎదురుచూస్తూ ఉన్నారు.
ఎట్టకేలకు చంద్రబాబు కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే కలవడానికి అనుమతి ఇచ్చింది సీఐడీ. సిట్ కార్యాలయంలో 2 గంటలు వేచి ఉన్న తర్వాత కుటుంబ సభ్యుల్ని చంద్రబాబుకు సీఐడీ కల్పించింది. చంద్రబాబుని లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ కలిశారు. ఎవరికి ఎలాంటి ఆందోళన వద్దని కుటుంబ సభ్యులతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. కుట్ర రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై లోకేష్, బాలకృష్ణతో చర్చించినట్టు తెలుస్తుంది. చంద్రబాబుని కలిసిన తర్వాత సిట్ కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. మిగతా నాయకులకి కలిసేందుకు సీఐడీ అనుమతి ఇవ్వలేదు.
Also Read : Balakrishna : గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో బాలకృష్ణ.. చంద్రబాబు అరెస్ట్ పై ఏం మాట్లాడంటే..