Chandrababu : చంద్రబాబు నోటి వెంట మహేష్ బాబు డైలాగ్..బాబు ‘మడత’మజాకా..!!

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 11:45 PM IST

ఎన్నికలు సమీపిస్తుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జోరు పెంచారు. తన వయసును సైతం పక్కన పెట్టి యువ నేతగా పరుగులుపెడుతున్నాడు. ఓ పక్క పొత్తుల అంశం , అభ్యర్థుల ఎంపిక మరోపక్క అధికార పార్టీ ఫై విమర్శలు , ప్రజలకు మేలు కలిగించే హామీలు ఇలా అన్ని తానై చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

తాజాగా గురువారం విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం‘ పుస్తకాన్ని (Vidhwansam Book Launch) ఏ1 కన్వెన్షన్ సెంటర్​లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు హాజరయ్యారు. చంద్రబాబు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని పవన్ కళ్యాణ్ కు అందజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై ఆలపాటి సురేష్ కుమార్ పుస్తకంలో పొందుపరిచారు. మొత్తం 185 అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు.. కుర్చీ మడతపెట్టే డైలాగ్ తో సీఎం జగన్ ఫై విరుచుకుపడ్డారు. ‘ఈరోజు CM జగన్ సభలో మాట్లాడుతూ.. చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చిందన్నారు. నువ్వు, మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతబెడితే.. మా టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు, ప్రజలు కుర్చీలు మడతబెడతారు. అందరూ కుర్చీలు మడతబెడితే నీ కుర్చీ లేకుండా పోతుంది జగన్ రెడ్డి’ అని చంద్రబాబు హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని ఆకాంక్షించారు. ఇక రాష్ట్రంలో ఈ వైసీపీ సర్కార్ వల్ల కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని..ఉన్న పరిశ్రమలనే బయటకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు. ‘అమరరాజా బ్యాటరీస్ సంస్థను వేధించి తెలంగాణకు పంపించారు. పేదలకు ఆహారం అందిస్తే భరించలేక అన్న క్యాంటీన్లను మూసేశారు. జనసేన ఇప్పటం సభకు ప్రజలు స్థలం ఇచ్చారని రోడ్ల వెడల్పు పేరుతో వారి ఇళ్లను కూల్చేశారు. నేను, పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ బాధితులమే’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..విధ్వంసం రచయత ఆలపాటి సురేష్.. పుస్తకాన్ని తనకు పంపారని , ఈ పుస్తకాన్ని అయన ప్రజల పక్షం వహించి రాశారన్నారు. ఎంత బిజీగా వున్నా కూడా సురేష్ కుమార్ గారిపై వున్న గౌరవమే.. తనను ఈ కార్యక్రమానికి రప్పించిందన్నారు. 700 పేజీలతో వచ్చిన ఈ విధ్వంసం పుస్తకం పాలకులకు ఎలా ఉండకూడదో చెప్పే ఒక హెచ్చరిక అని పవన్ కళ్యాణ్ అన్నారు. కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం… అదే విధంగా కూలిపోతుందన్నారు. 33 వేల మంది ఆడపిల్లలు వైసీపీ వలంటీర్ల వల్ల మాయమయ్యారని తాను అనలేదన్నారు. వాళ్ళు సేకరించిన సమాచారం వల్ల మాయమయ్యారు అయ్యారు అని చెప్పలేదని గుర్తు చేశారు. తాను సేవ చేస్తున్న వలంటీర్లను ఎవరినీ అనడం లేదని.. తప్పు చేసిన కొంత మందిని మాత్రమే అంటున్నానని చెప్పుకొచ్చారు.

Read Also : T Congress : రేపు భారీ ఎత్తున కాంగ్రెస్ లో చేరబోతున్న బిఆర్ఎస్ కీలక నేతలు