Site icon HashtagU Telugu

Chandrababu Remand: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. అక్టోబర్ 19 వరకు రిమాండ్

Chandrababu Remand

Chandrababu Remand

Chandrababu Remand: స్కిల్ కేసులో చంద్రబాబుకు చుక్కెదురైంది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు రిమాండ్ ను మరోసారి పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. నెల రోజులుగా రాజమండ్రి జైలులో ఉంటున్న చంద్రబాబు రిమాండ్ ను మరో 15 రోజులు పొడిగించాలని ఏపీ సీఐడీ మెమో దాఖలు చేయగా దీనిపై ఈ రోజు గురువారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. అందులో భాగంగా చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచే వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపర్చారు. అనంతరం రిమాండ్ ను ఈ నెల 19 వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబు బెయిల్ విషయంపై ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి. ఒకవైపు సీఐడీ కస్టడీ కోరుతూ పిటిషన్ వేయగా, మరోవైపు చంద్రబాబు తరుపు న్యాయవాదులు బెయిల్ ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తే, చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే బెయిల్ అంశంపై వాదించారు. ఇరువురి వాదనలు కొంతసేపు వాడివేడిగా సాగాయి. కస్టడీకి కోరడానికి తగిన కారణాలు ఉన్నాయని సీఐడీ న్యాయవాది వాదించగా, కక్షపూరిత చర్యగా వర్ణిస్తూ కస్టడీ అడుతున్నారని దూబే ఆరోపించారు.

ఈ క్రమంలో స్కిల్ స్కాంలో చేతులు మారిన రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లినట్లు నిరూపించే ఆధారాల్ని సీఐడీ న్యాయవాది కోర్టుకు సమర్పించారు. మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇస్తే వాస్తవాలు బయటికి వస్తాయని పొన్నవోలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరు వాదనలు విన్న ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 19వరకు పొడిగిస్తూ నిరయం తీసుకున్నారు. అలాగే బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.

Also Read: Dussehra: APSRTC కీలక నిర్ణయం, దసరాకు 5, 500 ప్రత్యేక సర్వీసులు ప్రారంభం