Chandrababu Custody: చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ అక్టోబర్ 5 వరకు పొడిగింపు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీని విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు పొడిగించింది.

Chandrababu Custody: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీని విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు పొడిగించింది. చంద్రబాబు కస్టడీ ఆదివారంతో ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి హిమ బిందు కస్టడీని 11 రోజులు పొడిగించారు. రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసిన వెంటనే బాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అంతకుముందు చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు జైల్లో విచారించారు.ప్రశ్నోత్తరాల సమయంలో చంద్రబాబుపై థర్డ్-డిగ్రీ ఉపయోగించారా అని న్యాయమూర్తి ఆరా తీశారు. తదుపరి విచారణ నిమిత్తం చంద్రబాబు కస్టడీని పొడిగించాలని సీఐడీ కోర్టును అభ్యర్థించింది. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తి కోరారు.కాగా.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని ప్రవేశపెట్టార. ఈ ప్రాజెక్టు విలువ రూ.3300 కోట్లు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.371 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని సీఐడీ పేర్కొంది. ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం చేసిన మొత్తం 10 శాతం నిబద్ధతకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూ. 371 కోట్ల అడ్వాన్స్‌ను ప్రైవేట్ సంస్థల ద్వారా ఖర్చు చేయకముందే విడుదల చేసినట్లు ఏజెన్సీ పేర్కొంది. సిఐడి ప్రకారం ప్రభుత్వం అడ్వాన్స్‌గా విడుదల చేసిన డబ్బులో ఎక్కువ భాగం నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్ కంపెనీలకు మళ్లించబడిందని అసలు ఆరోపణ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి సెప్టెంబర్ 9న అరెస్టు చేసింది. మరుసటి రోజు విజయవాడ ఏసీబీ కోర్టు అతడిని సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపి.. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే శుక్రవారం రోజున బాబు జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 24 వరకు పొడిగించింది. అదే రోజు సిఐడికి రెండు రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, జ్యుడీషియల్ రిమాండ్‌ను రద్దు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.

Also Read: Telangana : తెలంగాణలో బీజేపీకి షాక్‌.. బీఆర్ఎస్‌లో చేరిన తొమ్మిది మంది నిజామాబాద్ నేత‌లు