Site icon HashtagU Telugu

TDP : పీలేరు స‌బ్‌జైల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు చంద్ర‌బాబు ప‌రామ‌ర్శ‌.. పోలీసుల తీరుపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం

Chandrababu

Chandrababu

పీలేరు సబ్ జైలులో ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. పుంగనూరు నియోజకవర్గం లో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్ట‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏడుగురు మైనారిటీ సోదరులపై కేసులు పెట్టారని… అయ్యప్ప భక్తుడిపైనా కేసు పెట్టి జైల్లో పెట్టారని చంద్ర‌బాబు తెలిపారు. 21 ఏళ్లు ఉన్న ఇంటర్మీడియట్ చదువుతున్న పఠాన్ రియాజ్ ఖాన్ అనే యువకుడిపై కేసు పెట్టడం దుర్మార్గ‌మ‌న్నారు. ఏ కారణాలూ లేకుండా ఎఫ్ఐఆర్ లో ఇతరులు అని చేర్చి 8 మందిని అక్రమంగా అరెస్టు చేశారని.. అరెస్టు చేసిందే కాక స్టేషన్ కు తీసుకొచ్చి వారిని హింసించారని చంద్ర‌బాబు తెలిపారు. ఎంపీ రఘురామరాజును కొట్టినట్లుగా ఇక్కడి సీఐ, ఎస్ఐ అరెస్ట్ చేసిన వారిపై నీచంగా కొట్టి, భయపెట్టి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారని.. మెజిస్ట్రేట్ వద్ద కొట్టినట్లు చెప్తే కాల్చేస్తాం, కేసులు పెట్టి తిప్పుతాం అని బెదిరించారని చంద్ర‌బాబు ఆరోపించారు. దీనకంటే ఉగ్రవాద చర్య మరొకటి ఉంటుందా అని పోలీసుల్ని ప్ర‌శ్నించారు. ఖాకీ బట్టులు వేసుకున్న వాళ్లు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని..వీళ్లందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్ర‌బాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని… పోలీసులు చట్టాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించి త‌మ‌ల్ని ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలిపెట్టమ‌న్నారు.