Tesla : ‘టెస్లా’పై బాబు విజ‌న్‌కు ఐదేళ్లు.!

`రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబును విమ‌ర్శించొచ్చుగానీ, ఆయ‌న విజ‌న్ ను ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేరు..` అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏ మాత్రం సంకోచించ‌కుండా ప‌లు వేదిక‌ల‌పై చెప్పాడు.

  • Written By:
  • Publish Date - January 17, 2022 / 02:32 PM IST

`రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబును విమ‌ర్శించొచ్చుగానీ, ఆయ‌న విజ‌న్ ను ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేరు..` అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏ మాత్రం సంకోచించ‌కుండా ప‌లు వేదిక‌ల‌పై చెప్పాడు. తాజాగా `టెస్లా` ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప‌రిశ్ర‌మ కోసం కేటీఆర్ చేసిన ట్వీట్ త‌రువాత బాబు విజ‌న్ ను ఎందుకు ప్ర‌శంసించారో..అర్థం అవుతోంది.టెస్లా కంపెనీ కోసం మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, పంజాబ్ రాష్ట్రాలు పోటీప‌డుతున్నాయి. త‌మ రాష్ట్రంలో ఆ ప‌రిశ్ర‌మ‌ను పెట్టాల‌ని వారం నుంచి వాళ్లు లైజ‌నింగ్ మొద‌లుపెట్టారు. కంపెనీ సీఈవో ఎలెన్ మాస్క్ ట్విట్ట‌ర్ వేదిక‌గా భార‌త ప్ర‌భుత్వం రూపంలో ఉన్న స‌వాళ్ల‌పై స్పందించిన త‌రువాత మ‌హారాష్ట్ర మంత్రి జ‌యంత్ పాటిల్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, మ‌హారాష్ట్ర పీసీసీ చీఫ్ సిద్ధూ రీ ట్వీట్ చేస్తూ ఆహ్వానించారు. కానీ, చంద్ర‌బాబునాయుడు ఇదే టెస్లా కంపెనీ సీఈవో ఎలోన్ మాస్క్ తో 2017లోనే లైజ‌నింగ్ చేశాడు. అమెరికాలోని లోవా స్టేట్ యూనివ‌ర్సిటీ వేదిక‌పై సంప్ర‌దాయ విద్యుత్, నిల్వ‌లు, ఇంట‌ర్ నెట్ త‌దిత‌ర అంశాల‌పై టెస్లాతో అగ్రిమెంట్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

విజ‌న్ 2020ని త‌యారు చేసిన చంద్ర‌బాబు తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయ‌గ‌లిగాడు. 2004 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ ఆయ‌న త‌యారు చేసిన 2020 మార్గంలోనే ఇవాళ్టి కేసీఆర్ ప్ర‌భుత్వం కూడా న‌డుస్తోంది. బంగారు గుడ్డుపెట్టే బాతులాంటి తెలంగాణ‌కు 2020 విజ‌న్ పునాదుల‌ను 1999లోనే చంద్ర‌బాబు వేశాడు. ఆ విజ‌న్ ఫ‌లాల‌ను ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌లు అనుభవిస్తున్నారు. అందుకే, బాబు విజ‌న్ ను ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేర‌ని మంత్రి కేటీఆర్ అన్నాడు.రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీని ప్ర‌పంచ ప‌టంలో నిల‌పాల‌ని 2014లో సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు విజ‌న్-2050 రూపొందించాడు. ఆ క్ర‌మంలో అమ‌రావ‌తి ప్రాజెక్టును చేప‌ట్టాడు. సమాంత‌రంగా విశాఖ‌, తిరుప‌తి, అనంత‌పురం న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయాల‌ని బ్లు ప్రింట్ రూపొందించాడు. ఐటీ రాజ‌ధానిగా విశాఖ‌ను త‌యారు చేయాల‌ని పారిశ్రామిక‌వేత్త‌ల స‌ద‌స్సుల‌ను ప్ర‌తి ఏడాది నిర్వ‌హించాడు. 18ల‌క్ష‌ల కోట్ల విలువైన ఒప్పందాలు జ‌రిగాయ‌ని ఆనాడు పారిశ్రామిక‌వేత్త‌ల స‌ద‌స్సుల్లో తేలింది. వాటిలో కొన్ని కార్య‌రూపం దాల్చ‌డాన్ని ఏపీ ప్ర‌జ‌లు చూశారు. క‌నీసం 20శాతం కంపెనీలు ఒప్పందం ప్ర‌కారం వ‌చ్చిన‌ప్ప‌టికీ లక్ష‌ల్లో ఉద్యోగాలు వస్తాయ‌ని చంద్ర‌బాబు ఆనాడు భావించాడు.

హార్డ్ వేర్ రాజ‌ధానిగా అనంత‌పురంను త‌యారు చేయాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేశాడు. కియా కార్ల కంపెనీ రావ‌డంతో అక్క‌డి భూముల ధ‌ర‌ల‌ను ఆకాశాన్నంటాయి. సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ల‌ను అక్క‌డ నెల‌కొల్పాల‌ని త‌ల‌పోశాడు. రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల‌సీమ‌గా మార్చాల‌ని తిరుప‌తి కేంద్రంగా శ్రీసిటీని అభివృద్ధి ప‌రిచాడు. ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుప‌తికి ఉన్న బ్రాండ్ ను మ‌రింత పెంచాల‌ని క‌ల‌లుక‌న్నాడు. గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల వెంబ‌డి ఉండే కోస్తా తీరాన్ని సింగ‌పూర్ గా మ‌ల‌చాల‌ని భ్ర‌మించాడు. కోస్తా కారిడార్ వెంబ‌డి ఓడ‌రేవుల‌తో క‌ళ‌క‌ళ‌లాడాల‌ని ఊహించుకున్నాడు. ఎందుకు విడిపోయామా? అని తెలంగాణ ప్ర‌జ‌లు భావించేలా అభివృద్ధి చేసి చూపాల‌ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు. విధి వంచించిందో…తెలంగాణ రాష్ట్రం అదృష్ట‌మోగానీ..చంద్ర‌బాబు క‌ల‌ల‌న్నీ ప‌గ‌టి క‌ల‌లుగా మిగిలిపోయాయి. కానీ, ఆయ‌న విజ‌న్ మాత్రం ప‌క్క రాష్ట్రాల మంత్రుల‌కు, ఇత‌ర దేశాల్లోని పారిశ్రామిక‌వేత్త‌ల‌కు త‌ర‌చూ గుర్తొస్తోంది.తాజాగా టెస్లా కంపెనీ ఎపిసోడ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఆ సంద‌ర్భంగా ఆ కంపెనీతో 2017లోనే సీఎం హోదాలో చంద్ర‌బాబు చేసుకున్న ఒప్పందాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తెలంగాణ‌,మ‌హారాష్ట్ర‌, పంజాబ్ కంటే ఐదేళ్ల ముందే టెస్లా కంపెనీ కోసం ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకున్న అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సో..చంద్ర‌బాబు విజ‌న్ ఏమిటో కేటీఆర్ చెప్ప‌డం కాదు..ఇప్పుడు టెస్లా రూపంలో మ‌రోసారి నిరూప‌ణ అయింద‌న్న‌మాట‌.