TDP NDA Alliance : `ఎన్డీయేలో టీడీపీ` పై చంద్ర‌బాబు నో కామెంట్‌

ఎన్డీయేలో టీడీపీ చేర‌బోతుంద‌ని ఇట‌వ‌ల విస్తృతంగా జ‌రిగిన ప్ర‌చారంపై చంద్ర‌బాబు స్పందించ‌డానికి నిరాక‌రించారు.

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 05:29 PM IST

ఎన్డీయేలో టీడీపీ చేర‌బోతుంద‌ని ఇట‌వ‌ల విస్తృతంగా జ‌రిగిన ప్ర‌చారంపై చంద్ర‌బాబు స్పందించ‌డానికి నిరాక‌రించారు. ప్ర‌చారం చేసిన వాళ్ల‌నే అడ‌గమ‌ని విలేక‌రుల‌కు సున్నితంగా చుర‌క‌లు వేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఆనాడు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా న‌ష్ట‌పోయిన దాని కంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ల‌న ఎక్కువ‌గా న‌ష్ట‌పోయామ‌ని అన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గ‌ద్దె దించ‌డంతో పాటు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఎన్డీయేతో క‌లిసే అవ‌కాశం ఉంద‌న్న సంకేతం ఇచ్చిన‌ట్టు ఆయ‌న మాట‌ల ద్వారా బోధ‌ప‌డుతోంది. మీడియా స‌మావేశంలో ఆయ‌న చెప్పిన విష‌యాలివి.

 

*ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామ్యంపై ప్రస్తుతం తాను స్పందించనన్న చంద్రబాబు

* రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని వ్యాఖ్య

★ త్వరలోనే ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

★ ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబును మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు.

★ ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందని చెపుతున్న వారినే ఈ ప్రశ్న అడగాలని ఆయన అన్నారు.

★ ప్రచారం చేస్తున్న వారే దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.

★ తానైతే ప్రస్తుతం దీనిపై స్పందించనని చెప్పారు.

★ రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన దానికంటే జగన్ పాలన వల్ల రాష్ట్రం ఎక్కువ నష్టపోతోందని చంద్రబాబు అన్నారు.

★ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు.

★ రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే తాము కేంద్ర రాజకీయాలను చూస్తామని అన్నారు.

★ అధికారంలో ఉన్నప్పుడు పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల రెండు సార్లు నష్టపోయామని చెప్పారు.

★ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని తెలిపారు.

★ దేశంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనే అని చెప్పారు.

★ టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రెట్టింపు చేస్తామని అన్నారు.