Site icon HashtagU Telugu

TDP : నాది విజన్.. జగన్ ది పాయిజన్ : టీడీపీ అధినేత చంద్ర‌బాబు

TDP

TDP

టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలిపారు. ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి వచ్చిన జగన్ రాజధానిని నాశనం చేశార‌ని.. అమరావతికి తప్పకుండా మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామ‌ని తెలిపారు. తనది విజన్ అయితే..జగన్ ది పాయిజన్ అని, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తానని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ప్రజల్ని మాయ చేయడానికి జగన్ మారీచుడిలా రకరకాల వేషాలేస్తున్నాడని.. ఎన్నికలకు ముందు ముద్దులుపెట్టి, నెత్తిన చెయ్యి పెట్టి హామీలిచ్చి అధికారంలోకి రాగానే మాట మార్చాడన్నారు. ఇప్పుడు మరోసారి సిద్ధం అంటూ కథలు చెబుతున్నాడని.. ఇలాంటి మారీచుల్ని తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని ఆయ‌న పిలుపునిచ్చారు. యువత ఎటువైపు ఉంటే విజయం వారిదేన‌న్నారు. పొన్నూరులో ఏడు సార్లు టీడీపీని గెలిపించి కంచుకోటగా నిలిపారని.. అలాంటి పొన్నూరు పొగరు చూపించాల్సిన సమయమొచ్చిందని ఆయ‌న తెలిపారు. జగన్ అనే సైకో, ఊరికో సైకోను తయారు చేశాడని.. వీరందరినీ అణచివేయడం తధ్యమ‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తారు ఐటీని ప్రోత్సహించి కంపెనీలు తెస్తే.. జగన్ రెడ్డి ఐదువేలకు వాలంటీర్ ఉద్యోగాలిచ్చాడని ఎద్దేవా చేశారు. ఫిష్ మార్టులు, మటన్ కొట్లు, మద్యం కొట్లలో వ్యాపారం అంటూ యువత జీవితాలను చిత్తు చేస్తున్నాడని మండిప‌డ్డారు. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు లాంటి దాదాపు 130 సంక్షేమ పథకాలు రద్దు చేశాడని.. అధికారం కోసం శవం ముందు సంతకాలు సేకరించిన పార్టీ జగన్ రెడ్డిది అని చంద్ర‌బాబు అన్నారు. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో తాను ముందడుగేశాన‌ని.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసం పెంచడం ద్వారా సంపద సృష్టించాన‌ని తెలిపారు. సైబరాబాద్ నిర్మించడంతో దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచిందన్నారు. అదే స్థాయిలో అమరావతి నిర్మాణానికి శీకారం చుట్టానన‌ని… కానీ జగన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని మండిప‌డ్డారు. ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఎవరూ చేయని సాహసం అమరావతి రైతులు చేశారని.. 35 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారని.. అలాంటి అమరావతిపై కులం ముద్ర వేశాడన్నారు.

Also Read:  Mrunal Thakur Glamour Attack : ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో మృణాల్ గ్లామర్ ఎటాక్.. బాలీవుడ్ అంటేనే రెచ్చిపోతున్న అమ్మడు..!

అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియేట్, హైకోర్టు అన్నీ కట్టాం. విట్, ఎస్.ఆర్.ఎం, అమృత్ లాంటి యూనివర్శిటీలు అమరావతికి తీసుకొచ్చాన‌న్నారు. దేశంలో టాప్ వర్శిటీలు, స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రులు ఇక్కడకు రావాలని కలలుకన్నానని చంద్ర‌బాబు తెలిపారు. జగన్ పార్టీ ఫ్యాన్ మూడు రెక్కలు విరగ్గొట్టేందుకు ప్రజలంతా ఏకమవ్వాలని… బాదుడే బాదుడు రెక్కను ఉత్తరాంధ్ర వాళ్లు విరగ్గొట్టాలన్నారు. విధ్వంసాల రెక్కను రాయలసీమ వాసులు.. హింసా రాజకీయాలను కోస్తా వాసులు విరగ్గొట్టాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. రెక్కల్లేని ఫ్యాన్ తాడేపల్లిలో కూర్చోబెట్టాలన్నారు.

Exit mobile version