Site icon HashtagU Telugu

Allu Arjun : అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. వైసీపీపై చంద్రబాబు విమర్శలు..

Chandrababu Naidu Comments Allu Arjun Visit Ysrcp Candidate Ravi Chandra Kishore Reddy

Chandrababu Naidu Comments Allu Arjun Visit Ysrcp Candidate Ravi Chandra Kishore Reddy

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన నంద్యాల పర్యటనతో మెగా అభిమానులు, జనసైనికులతో పాటు మొత్తం తెలుగు ప్రజలకు భారీ షాక్ ఇచ్చారు. ఒక పక్క తమ కుటుంబసభ్యుడు పవన్ కళ్యాణ్ వైసీపీని గద్దె దించేందుకు భారీ పోరాటం చేస్తుంటే.. అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ లీడర్ కి మద్దతు తెలపడం ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరుస్తుంది. తన మిత్రుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

గతంలో తన స్నేహితుడికి అల్లు అర్జున్ మాట ఇచ్చారట. తాను వచ్చి ప్రచారం చేస్తానని రవిచంద్రకి బన్నీ మాట ఇచ్చారట. ఆ మాటని నిలబెట్టుకోవడం కోసమే.. అల్లు అర్జున్ ఇప్పుడు నంద్యాల రవిచంద్ర ఇంటికి మద్దతు తెలిపేందుకు వచ్చినట్లు వెల్లడించారు. తనకి పార్టీలతో సంబంధం లేదని, తన మిత్రుడు ఏ రంగంలో ఉన్నా.. వారికీ సపోర్ట్ చేయడానికి తాను తప్పకుండా వస్తానని చెప్పుకొచ్చారు.

కాగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పై మెగా అభిమానులు, జనసైనికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందిస్తూ.. వైసీపీ పై విమర్శలు చేసారు. “జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యుడైన అల్లు అర్జున్, తన మిత్రుడిని కలవడం కోసం నంద్యాల వస్తే.. వైసీపీ వాళ్ళు దానిని తమకి అనుకూలంగా ఉపయోగించుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు” అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.