Chandrababu: టీడీపీ క్యాడర్ కు బాబు సూచనలు, ఇలా చేస్తే గెలుపు మనదే

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇందుకోసం పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగనుంది.

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇందుకోసం పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగనుంది. ఏపీలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఏపీలో ఎలాగైనా అధికారం చేపట్టాలని కూటమి భావిస్తుంది. జగన్ ని గద్దె దించడమే పనిగా పెట్టుకుంది. ఈ క్రమంలో పార్టీ కేడర్ ని బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా టీడీపీ అధినేత పార్టీ కేడర్ తో సమావేశం అయ్యారు. ఈ మేరకు కేడర్ కు సలహాలు సూచనలు చేశారు.

టీడీపీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులతో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. వర్క్‌షాప్‌కు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు . పార్టీ తన కార్యకర్తల కోసం 10 పాయింట్ల ఎజెండాను రూపొందించింది.

1. ప్రతి ఒక్క అభ్యర్థి నియోజకవర్గ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలి
2. అభ్యర్థులు చురుకైన కార్యకర్తను వ్యక్తిగతంగా పిలిచి కలవాలి
3. అభ్యర్థులు టీడీపీ,జనసేన,బీజేపీ ప్రోటోకాల్ కమిటీని నియమించాలి
4. అసమ్మతి నేతలను కనీసం మూడు సార్లు కలవండి
5. పోలింగ్ నిర్వహణ కోసం ప్రతిభావంతులైన టీంను నియమించుకోండి
6. కార్పొరేట్ సోషల్ మీడియా టీమ్‌లను రూపొందించండి
7. ప్రతి కుల నాయకుడిని వ్యక్తిగతంగా కలవండి
8. పార్టీ సభ్యులందరికీ ప్రచార షెడ్యూల్‌ను రూపొందించండి. అభ్యర్థులతో పాటు నియోజకవర్గంలోని అగ్రనేతలందరితో ప్రతి గ్రామాన్ని కవర్ చేయమని వారిని అడగండి.
9. రెచ్చగొట్టే ప్రకటనలకు దూరంగా ఉండండి, ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి క్యాడర్‌పై కేసులు పెడతాయి.
10. రాత్రి 10 గంటల తర్వాత విపక్షాల అసంతృప్తి పార్టీ సభ్యులను కలవండి.

Also Read: Chiranjeevi : తమ్ముడి బర్త్డే దగ్గరుండి మరి జరిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోస్ వైరల్?