Pegasus Spyware: మమతా ‘పెగాసస్’ బాంబ్.. బాబు రియాక్షన్!

చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం ఈ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని మమతా వ్యాఖ్యానించారు. అయితే దీదీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఖండించింది.

  • Written By:
  • Updated On - March 18, 2022 / 12:17 PM IST

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ తయారు చేసే ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ 4-5 సంవత్సరాల క్రితం రాష్ట్ర పోలీసులను ఆశ్రయించిందన్నారు. వివాదస్పద ఇజ్రాయెల్ స్పైవేర్ కేవలం రూ. 25కోట్లకు సరఫరా చేస్తామన్నారని ఆమె చెప్పారు. అయితే దాదాని తిరస్కరించామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పైవేర్ ను కొనుగోలు చేసిందని…దేశ భద్రత కోసం ఉపయోగించకుండా న్యాయమూర్తులు, అధికారులపై రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించిందని దీదీ సంచల ఆరోపణలు చేశారు.

అంతేకాదు పెగాసస్ తయారీదారు తమ వస్తువులను విక్రయించేందుకు ప్రతి ఒక్కర్నీ సంప్రదించిందన్నారు. కొన్నేళ్ల క్రితం మన పోలీసులు ఆశ్రయించి రూ. 25కోట్లు అమ్ముతామన్నారు. నాకు సమాచారం అందగానే మాకు అవసరం లేదని చెప్పాం. ప్రజల గోప్యత దెబ్బతింటుందని…దానిని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను తమ సర్కార్ తిరస్కరించినట్లు మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం ఈ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని మమతా వ్యాఖ్యానించారు. అయితే దీదీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఖండించింది. చంద్రబాబు ప్రభుత్వం అలాంటి కొనుగోళ్లు చేయలేదని స్పష్టం చేసింది. తాము నిజంగానే పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినట్లయితే…జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యేవారని నారా లోకేశ్ ప్రశ్నించారు. మమతా పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశంలో తెలుగుదేశం పార్టీ పేరును ప్రస్తావించారంటే ఆమెకు తప్పుడు సమాచారం వెళ్లిందన్నారు. పెగాసస్ తన స్పైవేర్ ను ఏపీ ప్రభుత్వానికి కూడా విక్రయించేందుకు ఆఫర్ చేసిందన్నారు. అయితే తాము దానిని తిరస్కరించినట్లు లోకేశ్ చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నా…చంద్రబాబు అందుకు దూరంగా ఉన్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక పనులకు చంద్రబాబు ఎప్పుడూ దూరంగా ఉంటారన్నారు. తాము పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినట్లయితే…జగన్ ఇన్నాళ్లూ చర్యలు తీసుకోకుండా ఆగేవారా అంటూ ప్రశ్నించారు.