Site icon HashtagU Telugu

Jagan Tirupati Visit Controversy: జగన్‌ను ఆపిందెవరు: సీఎం చంద్రబాబు

Jagan Tirupati Visit Controversy

Jagan Tirupati Visit Controversy

Jagan Tirupati Visit Controversy: తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అపశ్రుతి ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. తిరుపతి లడ్డు విషయంలో టీడీపీ మరియు వైసీపీ పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే నిన్న శుక్రవారం వైఎస్ జగన్ తిరుపతికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా పోలీసులు భద్రత దృష్ట్యా ఆంక్షలు విధించారు. దీంతో వైఎస్ జగన్ పర్యటన కాస్త రద్దయింది. అనంతరం వైఎస్ జగన్ (YS Jagan) మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వాన్ని రాక్షస పాలనగా అభివర్ణించారు. జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు (Chandrababu) స్పందించారు.

జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం చంద్రబాబు. అధికార టీడీపీపై వైఎస్ జగన్ ఆరోపణలను కొట్టిపారేశారు. టిటిడికి స్వంత సంప్రదాయాలు మరియు సూత్రాలు ఉన్నాయని, వాటిని మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. జగన్ తిరుపతి (Tirupati)  ఆలయాన్ని సందర్శించవద్దని చెప్పినట్లు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. తిరుమలకు జగన్ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి ఉంటే ఆ నోటీసులను మీడియా ముందు చూపించాలి కదా అని ప్రశ్నించారు. జగన్ కు తిరుపతిని సందర్శించడం ఇష్టంలేకనే ఆయన ఈ తరహా అసత్య ప్రచారానికి తెరలేపినట్లు మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఇక దళితుడ్ని ఆలయల్లోకి రాణిస్తారా అంటూ జగన్ టీడీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. దళితులను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నది ఎవరు అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి అతను ఎందుకు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడు? ప్రతి మతానికి గౌరవం ఇవ్వాల్సిన సంప్రదాయాలు ఉన్నాయి అని చంద్రబాబు చెప్పారు. అంతేకాకుండా జగన్ ఇతర మతాలను గౌరవిస్తామన్న ప్రకటనపై కూడా చంద్రబాబు ఎదురుదాడికి దిగారు.

గతంలో జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలలో నిబంధనలను తుంగలో తొక్కి దర్శించుకున్నారని, ఇప్పుడు కూడా అలానే కొనసాగించాలని భావిస్తున్నారని, ఇది అన్యాయమని, ఇంట్లో బైబిల్ చదువుతానని, ఇతర మతాలను గౌరవిస్తానని చెబుతున్నా..మతపరమైన సంప్రదాయాలను గౌరవించడం మరియు టిటిడి నియమాలు మరియు నిబంధనలను పాటించడం చాలా అవసరమని చెప్పారు చంద్రబాబు. తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని జగన్ చెప్పాడని చంద్రబాబు అన్నారు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్ట్ ఇచ్చిందని,మేము తయారు చేసిన రిపోర్ట్ కాదని చెప్పారు.

Also Read: BookMyShow : రూ.2500 టికెట్‌ రూ.3 లక్షలకు సేల్.. ‘బుక్‌ మై షో’ సీఈఓ, టెక్ హెడ్‌లకు సమన్లు