Site icon HashtagU Telugu

Davos : బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ..అప్పుడు IT ..ఇప్పుడు AI

Chandrababu Meeting Bill Ga

Chandrababu Meeting Bill Ga

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌(Bill Gates)తో సీఎం చంద్రబాబు (CM Chandrababu) భేటీ అయ్యారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(world economic forum annual meeting 2025)లో వీరు కలిశారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చంద్రబాబు ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘1995లో ఐటీ కోసం.. 2025లో ఏఐ కోసం’ అంటూ ఆయన రాసుకొచ్చారు.

Fact Check: ‘‘రాజకీయాలకు గుడ్ బై.. అమెరికాకు కేసీఆర్’’.. ఈ ప్రచారంలో నిజమెంత ?

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌లో ఐటీ కేంద్రం స్థాపించేందుకు నమ్మకం కల్పించి, నగరాన్ని ఐటి రంగంలో చక్కటి ప్రగతికి దోహదం చేసిన సంగతిని చంద్రబాబు బిల్ గేట్స్‌కు గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ఐటి అభివృద్ధి కోసం సహాయాన్ని అందించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నామని, దానికి బిల్ గేట్స్ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఈ యూనివర్సిటీ ద్వారా ఏఐ రంగంలో అత్యుత్తమ పరిశోధనలు జరగడంతో పాటు అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

రాష్ట్రంలో ఆరోగ్య ఇన్నోవేషన్ మరియు డయాగ్నోస్టిక్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం వహించాలనే ఆలోచనను మంత్రి లోకేష్ వినిపించారు. అలాగే ఆఫ్రికాలో అమలు చేసిన హెల్త్ డ్యాష్‌బోర్డ్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక అభివృద్ధికి సంబంధిత కార్యక్రమాలను ఫౌండేషన్ సహకారంతో నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బిల్ గేట్స్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. గతంలో ఐటి అభివృద్ధి కోసం బిల్ గేట్స్ ను కలిసి పనిచేసినట్లు, ఇప్పుడు ఏఐ అభివృద్ధికి కలిసి పనిచేస్తున్నామంటూ ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ కూడా ఈ సమావేశాన్ని అభినందిస్తూ.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై శ్రద్ధ చూపించనున్నట్లు తెలిపారు.