Site icon HashtagU Telugu

TDP vs YCP : వైపీసీ కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ మాస్టర్‌ ప్లాన్‌..!

YCP- TDP

Tdp Ycp Vimarshalu

ఎన్నికల నియమావళి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. వాలంటీర్లను పంపిణీ ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలే ఈ జాప్యానికి కారణంగా పేర్కొంటున్నారు. పింఛన్‌ పంపిణీకి టీడీపీ (TDP) నేతలు అడ్డుపడుతున్నారని వైఎస్సార్‌సీపీ (YSRCP) నేతలు ఆరోపిస్తుండగా, ఈసీ ఆదేశాలు తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వైఎస్సార్‌సీపీ ఉద్దేశపూర్వకంగానే పింఛన్‌ పంపిణీలో జాప్యం చేస్తోందని టీడీపీ నేతలు సైతం ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పందించారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన టీడీపీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. తన రాజకీయ లబ్ది కోసం బాబాయినే చంపేసిన జగన్.. ఓట్ల కోసం ఇలాంటి అనేక కుట్రలు చేస్తాడని ఆరోపించారు. మనం వచ్చాక రూ. 4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తామని.. రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తామని.. అన్ని విషయాలు లబ్దిదారులకు వివరించాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ పింఛన్ లబ్ధిదారుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛను అందజేస్తామన్న టీడీపీ హామీని పునరుద్ఘాటించారు.

We’re now on WhatsApp. Click to Join.

పింఛన్‌లు ఇప్పించే వరకు టీడీపీ నేతలు ఊరుకునేది లేదని, ప్రస్తుత ప్రభుత్వం క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే అందేలా జిల్లా కలెక్టర్లతో సమావేశం కావాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు కొనసాగుతారని, వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని, మెరుగైన వేతనాల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

జగన్‌ (YS Jagan Mohan Reddy)కు జవాబుదారీగా ఉండాలని, జగన్‌ రూ. 13వేల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా గత 15 రోజులుగా ఒక్కో కాంట్రాక్టర్‌కు చెల్లించిన మొత్తాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.
Read Also :T.Congress : 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపికపై టీ.కాంగ్రెస్ కసరత్తు