Site icon HashtagU Telugu

Tirumala Attack: చిరుత దాడిలో లక్షిత మృతి: CBN-లోకేష్ దిగ్బ్రాంతి

Tirumala Attack

New Web Story Copy 2023 08 12t193701.568

Tirumala Attack: తిరుమల వెళ్లి కష్టాలు చెప్పుకోవాలని అనుకునే వారిలో ఎంతోమంది చిరుత దాడికి గురవుతున్నారు. ఆ మార్గంలో కాలినడకన వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాలి. గతంలో ఈ మార్గాన వెళ్తున్న వారిపై చిరుత దాడి కేసులు వెలుగుచూశాయి. నిన్న శుక్రవారం ఆంధ్రపరదేశ్ కు చెందిన ఓ కుటుంబం కాలినడకన కొండకు వెళ్లిన సందర్భంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ప్రాణాలు విడిచింది. లక్షిత మరణంపై నారాలోకేష్ విచారం వ్యక్తం చేశారు.

నారా లోకేష్ మాట్లాడుతూ.. అలిపిరి మార్గంలో జంతువు దాడిలో చిన్నారి లక్షిత మృతి విషాదకరమన్నారు. కళ్ల ముందే కన్నబిడ్డ మరణం కన్నవాళ్లకి తీరని శోకము మిగిల్చిందని విచారం వ్యక్తం చేశారు. తిరుమలలో జంతువుల దాడులు పెరిగినా, సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో లక్షిత బలైందని ఆరోపించారు. నేరగాళ్ల పాలనలో కృర జంతువుల నుంచి జనానికి రక్షణ కరవైందని విమర్శించారు. భక్తుల భద్రతకి భరోసా ఇచ్చేలా తక్షణమే సర్కారు చర్యలు తీసుకోవాలిని ఆయన డిమాండ్ చేశారు. లక్షిత తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చిన్నారి తల్లిదండ్రులపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేయడం, వైకాపా పైశాచిక ప్రవృత్తిని బయట పెడుతోందని తెలిపారు. మీ అధినేత జగన్ ఓట్లు- సీట్లు కోసం బాబాయ్ అని కూడా కనికరించకుండా చంపేసాడని, అందరూ సైకో అబ్బాయిలా ఉండరు. దుర్మార్గపు ఆరోపణలు మాని, బాలిక కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

చిన్నారి మృతిపై చంద్రబాబు స్పందించారు. కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరమని తెలిపారు. కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతమని అన్నారు. పాప తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కొద్దిరోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన జరిగింది. ఈ కారణంగా అయినా టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేది. అధికారులు సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరించి, తగు రక్షణతో భక్తుల భయాన్ని తొలగించాలని నారా చంద్రబాబు డిమాండ్ చేశారు.

Also Read: Telangana: నిరుద్యోగులే ప్రగతిభవన్ గడీలను బద్దలు కొడతారు