Site icon HashtagU Telugu

Double Decker Bus : విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన చంద్రబాబు

Chandrababu Launches Double

Chandrababu Launches Double

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ బస్సులను (Double Decker Bus) ప్రారంభించారు. విశాఖపట్నం పర్యాటక రంగ అభివృద్ధికి ఈ బస్సులు ఎంతగానో తోడ్పడతాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ బస్సులను ఎలక్ట్రిక్ విధానంలో రూపొందించారు. ఈ బస్సుల ప్రారంభం విశాఖపట్నం పర్యాటక రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Indias GDP: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్!

ఈ బస్సులను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) మాట్లాడుతూ.. పర్యాటకులు విశాఖపట్నాన్ని పర్యావరణహితంగా ఉంచడానికి సహకరించాలని కోరారు. తీరప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచ్‌లను నిర్వహించడానికి పౌరులు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బస్సుల ద్వారా విశాఖ పర్యాటకానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఆయన తెలిపారు.

‘హాప్ ఆన్ హాప్ ఆఫ్’ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నాయి. పర్యాటకులు కేవలం రూ. 250 చెల్లించి రోజంతా ఈ బస్సులో ప్రయాణించవచ్చు. ఈ విధానం పర్యాటకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, తక్కువ ఖర్చుతో విశాఖపట్నం అందాలను వీక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులు విశాఖపట్నం నగరానికి ఒక కొత్త ఆకర్షణగా మారనున్నాయి.